వైద్య, విద్యారంగానికి పెద్దపీట : మంత్రి సురేఖ
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల కుప్పతో సర్కారుపై ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సీఎం రేవంత్‌రెడ్డి వైద్య, విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందన్నారు. రాబోయే రోజుల్లో వరంగల్‌ను హైదరాబాద్‌తో సమానంగా అభివృద్ధి చేయాలని, అందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఎన్నడూ తప్ప లేదని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment