‘రవాణా భత్యం’ మంజూరు..
విద్యారణ్యపురి : దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఎట్టకేలకు ఇటీవల రవాణా భత్యం మంజూరైంది. కిలోమీటర్ కంటే ఎక్కువ దూరం నుంచి ప్రాథమిక పాఠశాలలకు వెళ్లే విద్యార్థులకు, 3 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఉన్న యూపీఎస్‌లో చదువుకునే వారికి, 5కిలో మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న హైస్కూల్‌లో చదివే విద్యార్థులకు ఈ రవాణా భత్యం అందజేస్తారు.
ఒక్కో విద్యార్థికి రూ. 6 వేలు..
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2024–2025 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రతి నెల ఒక్కో విద్యార్థికి రవాణా భత్యం రూ. 600 చొప్పున పది నెలలకుగాను రూ. 6వేలు మంజూరు చేశారు. జిల్లాల వారీగా విద్యార్థుల సంఖ్య, మంజూరైన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి.
హనుమకొండ జిల్లాలో..
● హనుమకొండ జిల్లాలో సమగ్ర శిక్ష పరిధి పాఠశాలల్లోని 704 మంది విద్యార్థులకు రూ. 42లక్షల 24వేలు, పీఎంశ్రీ–1 స్కూళ్లలోని 112 మంది విద్యార్థులకు రూ.6లక్షల 72వేలు, పీఎంశ్రీ –2దశలోని స్కూళ్లలోని 50మంది విద్యార్థులకు రూ. 3లక్షలు మంజూరు చేశారు.
● వరంగల్ జిల్లాలో వివిధ పాఠశాలల్లోని 507మంది విద్యార్థులకు రూ. 30లక్షల 42వేలు, పీఎం శ్రీస్కూళ్లలో 47మంది విద్యార్థులకు రూ.2లక్షల 82వేలు మంజూరయ్యాయి.
● జనగామ జిల్లాలో వివిధ పాఠశాలల్లోని 661మంది విద్యార్థులకు రూ. 39లక్షల 66వేలు, పీఎంశ్రీ–1 స్కూళ్లలోని 78మంది విద్యార్థులకు రూ. 4లక్షల 68వేలు మంజూరయ్యాయి.
● ములుగు జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 380 మంది విద్యార్థులకు రూ. 22లక్షల 80వేలు , పీఎంశ్రీ –1 స్కూళ్లకు చెందిన 45మంది విద్యార్థులకు రూ. 2లక్షల 70వేలు, పీఎంశ్రీ –2 స్కూళ్లకు చెందిన 38 మంది విద్యార్థులకు రూ. 2లక్షల 28వేలు మంజూరయ్యాయి.
● మహబూబాబాద్ జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 443మంది విద్యార్థులకు రూ. 26లక్షల 58వేలు, పీఎంశ్రీ స్కూళ్లకు సంబంధించిన 30మంది విద్యార్థులు రూ. లక్షా 80 వేలు మంజూరయ్యాయి.
● జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో వివిధ పాఠశాలలకు చెందిన 367మంది విద్యార్థులకు రూ. 22లక్షల 2వేలు, పీఎంశ్రీ –1 కు సంబంధించిన స్కూళ్లకు చెందిన 64మంది విద్యార్థులకు రూ. 3లక్షల 84వేలు మంజూరయ్యాయి.
ఒక్కో విద్యార్థికి రూ. 6వేలు
త్వరలో అకౌంట్లలోకి..
Comments
Please login to add a commentAdd a comment