వాజ్‌పేయిని స్ఫూర్తిగా తీసుకోవాలి
హన్మకొండ: మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారి వాజ్‌పేయిని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి సి.హెచ్.విద్యాసాగర్ రావు అన్నారు. ఆదివారం హనుమకొండ హంటర్ రోడ్డులోని ‘డి’ కన్వెన్షన్‌లో ‘అటల్ జీ యాదిలో’ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో సి.హెచ్.విద్యాసాగర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ 1975లో కరీంనగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగాన్ని నాటితరం నాయకులు, ప్రజలు ఇప్పటికీ గుర్తు చేస్తారన్నారు. ఆ యన ప్రసంగం ఆధ్యంతం ఆకట్టుకునేలా సాగేదన్నారు. హిందీ భాషలో పద బంధాలు కూర్చి, పేర్చి మాట్లాడేవారన్నారు. దేశంలో అన్ని పార్టీలు దేశహితం కోసం ఒకటిగా ఉండాలని ఆలోచించాలనేవారన్నారు.దేశంలో ప్రజాస్వామ్యం ఫరిడవిల్లాలని కోరుకునేవారన్నారు. ప్రధానిగా దేశంలో అనేక అభివృద్ధి పథకాలు చేపట్టారని వివరించారు. రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకుని అధికారంలోకి రావాలని, ఈ దిశగా పార్టీ శ్రేణులు శ్రమించాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ అత్యధిక సీట్లు కై వసం చేసుకోవాలన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి శతజయంతి ఉత్సవాల ఉమ్మడి వరంగల్ జిల్లా కన్వీనర్ సీతారాం నాయక్ మాట్లాడుతూ ఉమ్మడి వరంగల్ జిల్లాతో అటల్ బిహారి వాజ్‌పేయికి అవినాభావ సంబంధముందన్నారు. చాలాసార్లు పర్యటించారన్నారు. ఈ ప్రాంత వ్యక్తులు వాజ్‌పేయితో ఉన్న సంబంధాలు, ఫొటోలు, టెలిగ్రాంలు, శుభాకాంక్షలు వంటివి ఉంటే తమకు చేరవేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే టి.రాజేశ్వర్ రావు, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండేటి శ్రీధర్, పార్టీ హనుమకొండ, వరంగల్ జిల్లాల అధ్యక్షులు కొలను సంతోశ్‌రెడ్డి, గంట రవికుమార్, నాయకులు కన్నెబోయిన రాజయ్య యాదవ్, మంద ఐలయ్య, నాగపురి రాజమౌళి గౌడ్, దేవేందర్ రెడ్డి, నిశిధర్ రెడ్డి, బలరాం, చాడ శ్రీనివాస్ రెడ్డి, రావుల కిషన్, చందుపట్ల కీర్తి, చాడ స్వాతి, ఆర్.పి.జయంత్‌లాల్, తదితరులు పాల్గొన్నారు.
మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి
సి.హెచ్.విద్యాసాగర్ రావు
Comments
Please login to add a commentAdd a comment