రూ.630.27 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
స్టేషన్‌ఘన్‌పూర్: జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ.630.27 కోట్లతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్‌రెడ్డి సభావేదికపైనుంచే వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. విద్యాశాఖకు సంబంఽధించి జఫర్‌గఢ్ మండలం కోణాయిచలంలో రూ.200 కోట్లతో యంగ్ ఇండియా సమీకృత రెసిడెన్షియల్ పాఠశాల సముదాయం, స్టేషన్‌ఘన్‌పూర్‌లో రూ.5.5 కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, వైద్యారోగ్యశాఖకు సంబంధించి రూ.45. 5 కోట్లతో వంద పడకల ఆస్పత్రి, ఆర్‌అండ్‌బీ శాఖకు సంబంధించి రూ.26 కోట్లతో స్టేషన్‌ఘన్‌పూర్‌లో సమీకృత డివిజనల్ కార్యాలయాల సముదాయం, ఇరిగేషన్‌కు సంబంధించి రూ.148.76 కోట్లతో దేవాదుల కాల్వ సీసీ లైనింగ్ నిర్మాణం, పీఆర్ శాఖ ఆధ్వర్యంలో రూ.38.5 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం, ప్రజాపాలన గ్రామసభ మోడల్ గ్రామాల్లో రూ.250 కోట్లతో 5వేల ఇందిరమ్మ ఇళ్లు, రూ.12 కోట్లతో ఐదు సబ్‌స్టేషన్లు, ఒక డీఈ కార్యాలయ నిర్మాణం, రూ.24 కోట్లతో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా తండాలకు రోడ్లు, బంజారా భవన్ నిర్మాణం, స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ అప్‌గ్రేడేషన్, రూ.35 కోట్లతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణం తదితర పనులకు సీఎం శంకుస్థాపనలు చేశారు.
మహిళా సంఘాలకు చెక్కుల పంపిణీ
మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల మాఫీ కింద ఉమ్మడి వరంగల్‌లో 48,717 సంఘాలకు రూ. 92 కోట్ల 74 లక్షల విలువైన చెక్కులు పంపిణీ చేశారు. అదేవిధంగా జనగామ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ కింద రూ.వంద కోట్ల 93 లక్షలు చెక్కులను మహిళా సంఘాల సభ్యులకు అందించారు. అదేవిధంగా జిల్లాలోని ఏడు మండలాలకు సంబంధించిన రూ.2.10 కోట్లతో మంజూరైన ఏడు ఇందిరా మహిళా శక్తి బస్సులను ప్రారంభించి వాటిని మహిళా సమాఖ్యలకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment