‘టెన్నికాయిట్ ఉమెన్’ విజేత అఖిల
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో రెండు రోజుల పాటు నిర్వహించిన 10వ రాష్ట్ర స్థాయి సీనియర్ మెన్ అండ్ ఉమెన్ టెన్నికాయిట్ చాంపియన్‌షిప్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. ఇందులో మహిళా విభాగంలో హనుమకొండ క్రీడాకారిణి జి. అఖిల విజయం సాధించింది. ద్వితీయ స్థానంలో వరంగల్ క్రీడాకారిణి బి. జ్యోతి నిలిచింది. వరంగల్ జిల్లా టెన్నికాయిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల ముగింపు వేడుకలకు ‘కుడా’ చైర్మన్ ఇనుగాల వెంకట్రాంరెడ్డి హాజరై విజేతలకు పతకాలు, ట్రోఫీలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ జేఎన్‌ఎస్‌లో టెన్నికాయిట్ కోర్టు నిర్మాణానికి కావాల్సిన నిధుల మంజూరుకు సహకరిస్తానన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టెన్నికాయిట్ అసోసియేషన్ కార్యదర్శి బీఎన్. వెంకటేశ్, శాట్ కోచ్ సద్గురు, అసోసియేషన్ హనుమకొండ, వరంగల్ జిల్లా కార్యదర్శులు అలువాల రాజ్‌కుమార్, గోకారపు శ్యాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన రాష్ట్ర స్థాయి పోటీలు..
విజేతలు
పురుషులు జిల్లా మహిళలు జిల్లా
ఎండి. యాసిన్ మహబూబ్‌నగర్ జి. అఖిల హనుమకొండ
సుజయత్ మహబూబ్‌నగర్ బి.జ్యోతి వరంగల్
డి. ప్రకాశ్ హనుమకొండ జి. నవ్య హనుమకొండ
జి.మధు వరంగల్ జి.మమత మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment