మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
ఉమ్మడి వరంగల్ జిల్లాలో టెన్త్ విద్యార్థుల వివరాలు
– 8లోu
ఏడాదంతా చదివింది ఒక ఎత్తయితే.. దాన్ని పరీక్షల్లో ప్రజెంట్ చేయడం మరో ఎత్తు.. కొందరు విద్యార్థులు బాగా చదువుతారు. తీరా పరీక్ష సమయానికి మరిచిపోతుంటారు.. మరికొందరేమో ఎంత చదివినా హ్యాండ్ రైటింగ్ బాగోలేక మార్కులు కోల్పోతారు.. ఇంకొందరైతే పరీక్ష అంటే గాబరా పడిపోయి ప్రశ్నల కు సమాధానం తెలిసినా నిర్ణీత సమయంలో రాయలేకపోతారు.. ఇలా చాలా మంది విద్యార్థులు ఏదో ఒక సమస్యతో బాధపడేవారే. వీరంతా మంచి మార్కులు సాధించేందుకు, పరీక్షలను ఈజీగా రాసేందుకు సబ్జెక్టు నిపుణులు సూచనలిస్తున్నారు. ఈనెల 21 నుంచి పదో తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. మంచి మార్కులు సాధించడానికి ఆయా సబ్జెక్టుల నిపుణులను ‘సాక్షి’ పలకరించింది. విద్యార్థుల కోసం వారు తమ సూచనలు, సలహాలు వెల్లడించారు. – మహబూబాబాద్ అర్బన్
మొత్తం విద్యార్థులు
42,262
బాలికలు
20,600
బాలురు
21,662
ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాయాలి
పదో తరగతి వార్షిక పరీక్షలు మరో మూడ్రోజుల్లో ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ఒత్తిడికి గురికాకుండా పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలి. బాగా చదివాను.. పరీక్షలు బాగా రాస్తాను.. అనే భావనతో వెళ్లాలి. నెగెటివ్ ఆలోచనలను దరిచేర నీయొద్దు. గతంలో సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. టీవీ, సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి. ఆహారం విషయంలోనూ జాగ్రత్తలు వహించాలి. ఫాస్ట్‌ఫుడ్, జంక్‌ఫుడ్ జోలికి వెళ్లొద్దు. సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా జీర్ణమవుతుంది. తగినంతగా నీరు తాగాలి. ఎవరైనా ఒత్తిడికి లోనైనా.. పరీక్షలంటే భయం కలిగినా 93911 17100, 94408 90073 నంబర్లకు ఫోన్ చేస్తే తగిన సూచనలిస్తాం.
– పోగు అశోక్, తెలంగాణ సైకాలజిస్ట్
అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
వివరాలు 8లోu
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
మంగళవారం శ్రీ 18 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment