ఎన్ని రోజులు తిరగాలి..
కలెక్టర్ సారూ చెప్పినా
అధికారులు పట్టించుకోవడం లేదు
● కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోతున్నాం
● ప్రజావాణిలో బాధితుల గోడు
సాక్షి, మహబూబాబాద్: ‘మా సమస్యలు నేరుగా కలెక్టర్‌కే చెప్పుకుంటే పరిష్కారం అవుతాయని సంబురపడ్డాం. ప్రతీ సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జరిగే ప్రజావాణి కోసం దూర ప్రాంతాల నుంచి వస్తున్నాం. దరఖాస్తులు కలెక్టర్ సర్, ఇతర పెద్ద సార్లకు ఇస్తున్నాం. మీ తహసీల్దార్, ఇతర అధికారులతో చెబుతాం.. మీ సమస్య పరిష్కారం అవుతుందని పెద్దసార్లు చెబుతున్నారు.. అక్కడికి వెళ్తే మమ్ముల్ని పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. దీంతో మళ్లీ కలెక్టర్ సార్ వద్దకు రావడం, మళ్లీ కింది స్థాయి అధికారుల వద్దకు వెళ్లడం మినహా మా సమస్య పరిష్కారం కావడం లేదు. కలెక్టర్, తహసీల్దార్, ఇతర అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరుగున్నాం.. కానీ ఏం లాభం లేకుండా పోయింది.. ఇంకా ఎన్ని రోజులు తిరగాలి’ అని సోమవారం గ్రీవెన్స్‌కు వచ్చిన పలువురు బాధితులు వాపోయారు.
ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలి
మాకు పర్వతగిరి గ్రామంలో 2.20 ఎకరాల భూమి ఉండేది. దానిలో 9 గుంటలు ఎస్సారెస్పీ కాల్వ నిర్మాణం కోసం తీసుకున్నారు. అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు నిర్మాణంలో రెండు ఎకరాలు కోల్పోయాం. మిగిలిన 11 గుంటల భూమి సాగుకు అనుకూలంగా లేదు. ఉద్యోగంతో పాటు పరిహారం పెంచి ఇవ్వాలి.
– మూలగుండ్ల కిరణ్‌కుమార్–దివ్య, దంపతులు, పర్వతగిరి
ఎన్ని రోజులు తిరగాలి..
Comments
Please login to add a commentAdd a comment