వేగంగా ‘అమృత్’ పనులు
మహబూబాబాద్ రూరల్: రైల్వే ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలనే లక్ష్యంతో మానుకోట రైల్వేస్టేన్‌ను అమృత్ భారత్ పథకానికి ఎంపిక చేసి రూ.39కోట్లు కేటాయించారు. ఈమేరకు అభివృద్ధి పనులు చకచక కొనసాగుతున్నాయి. దక్షిణ మధ్య రైల్వేశాఖ ఉన్నతాధికారుల పర్యవేక్షణలో జరుగుతున్న పనులు పూర్తయితే రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈమేరకు రైల్వే ప్రయాణికులకు మెరుగైన మౌలిక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
పూర్తయిన పనులు..
రైల్వేస్టేషన్ మాస్టర్, డిప్యూటీ ఎస్‌ఎస్ ప్యానెల్ రూమ్, ఎస్‌ఎన్టీ, టీఐ రిలే రూమ్ భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. వచ్చే నెల 18వ తేదీ వర కు ఆయా విభాగాల కార్యకలాపాలను ఆ భవనం నుంచే నిర్వహించనున్నట్లురైల్వే అధికారులు పేర్కొన్నారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఉన్నత శ్రేణి ఏసీ విశ్రాంతి గది, రెండో తరగతి ఏసీ, సాధారణ వి శ్రాంతి గది నిర్మాణ పనులు పూర్తి చేశారు. అలాగే ఒకటో ప్లాట్ ఫారం వైపున ప్రధాన ద్వారం ప్రాంతంలో ఫెసాడ్ పనులు పూర్తయ్యాయి. ప్రయాణికుల అవసరాల మేరకు షెడ్ల నిర్మాణం చేపట్టారు.
జరుగుతున్న పనులు..
రైల్వేస్టేషన్ 1, 2ప్లాట్ ఫారాలను రీ మోడలింగ్ చేస్తున్నారు. కొత్తగా 21 మీటర్ల వెడల్పుతో ఫుట్ ఓవర్ బ్రిడ్జి, ఎస్కలేటర్, 4 లిఫ్టులు, ఒక ర్యాంపు నిర్మాణం చేయనుండగా.. గార్డెన్ ఆధునికీకరణ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఒకటో నంబర్ ప్లాట్ ఫారంపై పూర్తిస్థాయిలో షెడ్ల నిర్మాణం, మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం చేయాల్సి ఉంది. రెండు ప్లాట్ ఫారాలపై సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
రూ.39 కోట్లతో మానుకోట
రైల్వేస్టేషన్ ఆధునికీకరణ
అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు
మెరుగైన వసతులు
వేగంగా ‘అమృత్’ పనులు
Comments
Please login to add a commentAdd a comment