ఘనంగా పుష్పయాగం, ఆరాధన పూజలు
మహబూబాబాద్ రూరల్: మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని అనంతాద్రి జగన్నాథ వేంకటేశ్వర స్వామివారి దేవాలయ 20వ వార్షికోత్సవంలో భాగంగా శ్రీపుష్పయాగం, ద్వాదశ ఆ రాధన, పవళింపు సేవ, ఆశీర్వచన పూజలు ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఆ లయ ప్రధాన అర్చకులు గొడవర్తి చక్రధరాచా ర్యులు పర్యవేక్షణలో గొడవర్తి శ్రీనివాసచా ర్యుల నిర్వహణలో సహ అర్చకులు విశ్వం, మట్టపల్లి విజయ్ కుమార్, గౌతమ్, చరణ్ పూజా కార్యక్రమాలు జరిపారు. శ్రీశక్రు, సోని యమ్మ సేవా సమితి వ్యవస్థాపకుడు, రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎ. శరత్, కుటుంబ సభ్యుల అధ్వర్యంలో సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గీతాంజలి స్కూల్ పక్షాన పొనగంటి రామకృష్ణ దంపతులు ద్వాదశ ఆరాధన ప్రసాదానికి విరాళం అందజేశారు. కార్యక్రమంలో నాయిని ప్రభాకర్ రెడ్డి, భక్తులు పాల్గొన్నారు.
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా
రమేశ్‌కుమార్ ఎంపిక
మరిపెడ రూరల్: మరిపెడ మండలం వీరారం గ్రామ పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్న భూక్య రమేశ్‌కుమార్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్‌గా ఎంపికయ్యారు. గత ఏడాది జూన్‌లో నిర్వహించిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్షల్లో రమేశ్‌నాయక్ ఉత్తీర్ణత సాధించారు. రమేశ్‌కుమార్ స్వగ్రామం మండలంలోని సోమ్లతండా కాగా ఆయనను తోటి ఉద్యోగస్తులు, మిత్రులు, గ్రామస్తులు అభినందించారు.
తొర్రూరులో నలుగురు..
తొర్రూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పరీక్ష ఫలితాల్లో తొర్రూరు మండలం నుంచి నలుగురు ఎంపికయ్యారు. మడిపెల్లి గ్రామానికి చెందిన అబ్బనాపురి బ్రహ్మచారి, పత్తేపురం గ్రామానికి చెందిన అనిరెడ్డి మోహన్‌రెడ్డి, చెర్లపాలెం గ్రామానికి చెందిన హనుమాండ్ల ప్రదీప్‌రెడ్డి, ధర్మారపు రాజు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లుగా ఎంపికయ్యారు. ఉద్మోగాలు సాధించిన వారిని మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామ పెద్దలు, బంధువులు, కుటుంబ సభ్యులు అభినందించారు.
ఉద్యమకారులకు
ప్రభుత్వ గుర్తింపు
మహబూబాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తిస్తుందని ప్రముఖ కవి, గాయకులు గొడిశాల జయరాజ్ అన్నారు. తమ స్వస్థలమైన జిల్లా కేంద్రానికి వచ్చిన జయరాజ్ సోమవారం అర్బన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య నివాసంలో విలేకరులతో మాట్లాడారు. అనంతరం గోడిశాల జయరాజును ఘనపురపు అంజయ్య, సుభాషిణి దంపతులు ఘనంగా సన్మానించారు.
ఘనంగా పుష్పయాగం, ఆరాధన పూజలు
Comments
Please login to add a commentAdd a comment