ఉల్లాసంగా బోధిస్తేనే ఉపయోగకరం
మహబూబాబాద్ అర్బన్/పెద్దవంగర/తొర్రూరు రూరల్/నెల్లికుదురు: ఉత్సాహంగా, ఉల్లాసభరితంగా బోధన సాగితేనే విద్యార్థులకు సులువుగా అర్థమవుతుందని ఎస్‌సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యుడు ఎస్‌ఎం.అహ్మద్ పేర్కొన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యూకేషన్ ఆదేశాల మేరకు సోమవారం జిల్లా కేంద్రం మానుకోటలోని కస్తూ ర్బాగాంధీ విద్యాలయం, పెద్దవంగరలోని జెడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ, తొర్రూరు మండలంలోని అమ్మాపురం ఉన్నత, ప్రాథమిక పాఠశాలలు, నెల్లికుదురు మండల కేంద్రంలోని కేజీబీవీ, ఆదర్శ పాఠశాలలను జిల్లా కోఆర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్‌తో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పరిశీ లించారు. అనంతరం ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులందరూ అభ్యసన ఫలితాలు సాధించేలా ప్రణాళికబద్ధమైన బోధన చేపట్టాలని, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ ఉపయోగించాలని మార్గనిర్దేశం చేశారు. ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత డిజిటల్ పద్ధతుల్లో విద్యాబోధన చేపట్టాలని సూచించారు. కంప్యూటర్ పరిజ్ఞానంతో విద్యార్థుల సంఖ్య పెరిగేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. కార్యక్రమంలో ఎంఈఓలు బుదారపు శ్రీనివాస్, మహంకాళి బుచ్చయ్య, జీసీడీఓ విజయకుమారి, కేజీవీబీ ప్రిన్సిపాల్ భవాని, ఎస్‌ఓ స్రవంతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
ఎస్‌సీఈఆర్టీ ఫ్యాకల్టీ సభ్యుడు
ఎస్‌ఎం అహ్మద్
Comments
Please login to add a commentAdd a comment