వినతులు వెంటనే పరిష్కరించాలి
అన్యాయం చేశారు..
పోలియో వల్ల మా కుమారుడు జీవన్ కాళ్లు, చేతులు చచ్చుబడిపోయాయి. తన పేరున స్వయం ఉపాధి కింద రూ.50వేల రుణం కోసం మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేశాం. ఈ విషయంలో సంబంధిత అధికారులు అన్యాయం చేశారు. కనీసం ఇంటర్వ్యూకు కూడా పిలువలేదు. ఈ విషయంలో విచారణ చేసి రుణం మంజూరు చేయాలి.
–సురేశ్–శైలజ దంపతులు, ఇనుగుర్తి
మహబూబాబాద్: ప్రజావాణిలో వచ్చిన వినతులను వెంటనే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించగా అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీరబ్రహ్మచారి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. పెండింగ్ వినతులను కూడా పరిష్కరించాలని, పరిష్కారం కాకపోతే, అందుకు గల కారణాలను తెలుపు తూ నివేదిక అందజేయాలన్నారు. సత్వర పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం అనే విషయాన్ని అధికారులు గుర్తు పెట్టుకోవాలన్నారు. దరఖాస్తుల విషయంలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కాగా ప్రజావాణిలో 69 వినతులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ పురుషోత్తం, సీపీఓ సుబ్బారావు, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
Comments
Please login to add a commentAdd a comment