విద్యార్థుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
మహబూబాబాద్ అర్బన్/నెహ్రూసెంటర్: పాఠశాల స్థాయి విద్యార్థుల్లో కంటి సమస్యలు పెరుగుతున్నాయని డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. ఆర్‌బీఎస్‌కే ఆధ్వర్యంలో ఇటీవల కంటి పరీక్షలు చేపట్టగా.. సోమవారం సమస్యలు ఉన్న విద్యార్థులకు ప్రభుత్వ ఆస్పత్రిలో కళ్లద్దాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. ఫిబ్రవరి 17 నుంచి 28వరకు కంటి పరీక్షలు నిర్వహించి, కంటి సమస్యలు ఉన్న 633మంది విద్యార్థులను గుర్తించామన్నారు. మొదటి విడతగా 274 మంది విద్యార్థులు కళ్లద్దాలు పంపిణీ చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్‌బీఎస్‌కే ప్రోగ్రాం ఆఫీసర్‌లక్ష్మీనా రాయణ, ఆశ్రమ పాఠశాల ప్రిన్సిపాల్ నర్సయ్య, నోడల్ అఽధికారి డాక్టర్ కుమార్, సబ్ యూనిట్ అధికారి రామకృష్ణ, మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రమ్య, ఫార్మసిస్ట్ శ్రీలక్ష్మీ, ఏఎన్‌ఎం లావణ్య పాల్గొన్నారు.
సీపీఆర్‌పై అవగాహన..
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో విద్యార్థులకు ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సీపీఆర్‌పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ మురళీధర్, కళాశాల ప్రిన్సిపాల్ లీలా, జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వరప్రసాద్, వైస్‌చైర్మన్ డాక్టర్ నెహ్రూ, కోశాధికారి వెంకట్‌రెడ్డి, డాక్టర్ ప్రత్యూష, డాక్టర్ వరప్రసాద్, అశోక్, శిరీష, కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ మురళీధర్
Comments
Please login to add a commentAdd a comment