ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలి
మహబూబాబాద్: యాసంగి సీజన్ ధాన్యం కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో సోమవారం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో 432 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో 1,79,000 మెట్రిక్ టన్ను ల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం ఉందన్నా రు. కేంద్రాల్లో ఎలక్ట్రానిక్ కాంటాలు, తాగునీరు తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ధాన్యం సేకరించిన తర్వాత ఆలస్యం చేయకుండా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలన్నారు. రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వీరబ్రహ్మచారి, ఆర్డీఓలు కృష్ణవేణి, గణేష్, డీసీ ఓ వెంకటేశ్వర్లు, డీఏఓ విజయనిర్మల, డీసీఎస్‌ఓ ప్రేమ్‌కుమార్, సివిల్ సప్లయీస్ డీఎం కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
Comments
Please login to add a commentAdd a comment