బకెట్‌తో నీరు తోడుతూ..
● సంపులో పడి యువతి మృతి
● రాజవరంలో ఘటన
చిల్పూరు: బకెట్‌తో నీరు తోడుతుండగా సంపులో పడి ఓ యువతి మృతి చెందింది.ఈ ఘటన మండలంలోని రాజవరంలో జరిగింది. ఎస్సై సిరిపురం నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సామల స్వాతి (21) ఆదివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బకెట్‌తో సంపులో నీరు తోడుతోంది. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందింది. ఈ ఘటనపై మృతురాలి తండ్రి సదానందం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సోమవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment