వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించాలి | - | Sakshi
Sakshi News home page

వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించాలి

Published Tue, Mar 18 2025 8:53 AM | Last Updated on Tue, Mar 18 2025 8:49 AM

వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించాలి

వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ అందించాలి

టీజీ ఎన్పీడీసీఎల్‌ సీఎండీ కర్నాటి వరుణ్‌ రెడ్డి

హన్మకొండ : విద్యుత్‌ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్‌ అందించాలని టీజీ ఎన్పీడీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కర్నాటి వరుణ్‌ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన పనులపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ లోడ్‌ పెరిగే అవకాశం ఉన్న అన్ని చోట్ల అన్ని సర్కిళ్ల పరిధిలో పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏ ర్పాటు చేశామన్నారు. ఇంటర్‌ లింకింగ్‌ పనులు, ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పా టు, వీసీబీల ఏర్పాటు, పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్‌ఈలను ఆదేశించారు. ఏప్రిల్‌లో పంట కోతలు పూర్తి కాగానే వ్యవసాయ సర్వీసుల త్వరితగతిన రిలీజ్‌ చేయాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ డైరెక్టర్లు బి.అశోక్‌ కుమార్‌, టి.సదర్‌ లాల్‌, టి.మధుసూదన్‌, సీఈలు తిరుమల్‌రావు, రాజు చౌహాన్‌, అశోక్‌, బీకం సింగ్‌, వెంకటరమణ, డీఈ అనిల్‌ కుమార్‌ పాల్గొన్నారు.

పోక్సో కేసులో ఇద్దరికి జైలు

గణపురం: పోక్సో కేసులో ఇద్దరికి జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు సోమవారం తీర్పు వెలువరించారు. 2020 సంవత్సరంలో గణపురం మండలం దుబ్బపల్లికి చెందిన ఓ బాలికను అదే గ్రామానికి చెందిన మోతె రవీందర్‌ వేధించగా బాలిక ఈ విషయం తన తల్లిదండ్రులకు తెలిపింది. దీంతో వారు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయి తీ నిర్వహించారు. ఈ సమయంలో రవీందర్‌ భా ర్య సునీత.. బాలికను, ఆమె తల్లిదండ్రులను దూషి స్తూ వారిపై దాడి చేయగా బాలిక తండ్రి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో అప్పటి ఎస్‌హెచ్‌ఓ ప్రభాకర్‌ పోక్సో కేసు నమోదు చేయగా అప్ప టి ఎస్సై సత్యనారాయణ రాజు చార్జ్‌షీట్‌ ఫైల్‌ చేశా రు. కోర్టు స్పెషల్‌ పీపీ విష్ణువర్ధన్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుత సీఐ మల్లేశ్‌, ఎస్సై అశోక్‌ ఆధ్వర్యంలో కోర్టు లైజనింగ్‌ అధికారి, ఏఎస్సై గాండ్ల వెంకన్న, కోర్టు కానిస్టేబుల్‌ శ్వేత సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. నేరం రుజువుకావడంతో భూపాలపల్లి ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు నింది తులకు సంవత్సరం జైలు, రవీందర్‌కు రూ.4,500, సునీతకు రూ.1,500 జరిమానా విధించారు.

గంజాయి కేసులో ఒకరికి పదేళ్లు..

రేగొండ: గంజాయి కేసులో ఒకరికి పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. లక్ష జరిమానా విధిస్తూ భూపాలపల్లి జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు సోమవారం తీర్పు వెలువరించారు. పోలీ సుల కథనం ప్రకారం.. కొత్తపల్లిగోరి మండలం ని జాంపల్లి గ్రామానికి చెందిన వంగల రాజన్న ఇంట్లో గంజాయి ఉందనే సమాచారం మేరకు 2019లో అప్పటి ఎస్సై సధాకర్‌ సోదాలు నిర్వహించి 25 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అప్పటి సీఐ సాయిరమణ విచారణ చేపట్టి కేసు న మోదు చేశారు. అనంతరం చిట్యాల సీఐ పులి వెంకట్‌ చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ప్రస్తుత సీఐ మల్లేశ్‌, ఎస్సై సందీప్‌కుమార్‌ ఆధ్వర్యంలో కోర్టు డ్యూ టీ అధికారి జ్యోతి.. సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టగా ప్రభుత్వ న్యాయవాది శ్రీనివాస్‌ వాదనలు విని పించారు. కేసు పూర్వాపరాలు విచారించిన జిల్లా ప్రధా న న్యాయమూర్తి నారాయణబాబు.. నిందితుడికి ప ది సంవత్సరాల జైలు శిక్ష రూ.లక్ష జరిమానా విధి స్తూ తీర్పు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు.

20న జాబ్‌ మేళా

హన్మకొండ అర్బన్‌ : ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనకు ఈనెల 20న(గురువారం) జాబ్‌ మేళా నిర్వహిస్తున్నట్లు హనుమకొండ జిల్లా ఉపాధి కల్పనా అధికారి ఎం.మల్లయ్య ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌లోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో వర్చువల్‌ సెల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌లో బిజినెస్‌ డెవెలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ 20 పోస్టుల భర్తీకి ములుగు రోడ్డు ప్రభుత్వ ఐటీఐ బాయ్స్‌ క్యాంపస్‌లోని జిల్లా ఉపాఽధి కార్యాలయంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. అభ్యర్థుల వయసు 18–35 ఏళ్ల లోపు ఉండాలని, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని, ఆసక్తి ఉన్న యువతీ యువకులు బయోడేటా, రెజ్యూమ్‌, విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్‌ కాపీలతో ఉదయం 11 గంటలకు హాజరుకావాలని సూచించారు. మరిన్ని వివరాలకు 98488 95937 నంబర్‌లో సంప్రదించాలని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement