వర్సిటీల అభివృద్ధికి నిధులు కేటాయించాలి
● కేయూ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి
కేయూ క్యాంపస్ : రాష్ట్ర పరిధిలోని ప్రభుత్వ యూనివర్సిటీల అభివృద్ధికి, పరిశోధనలకు కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందని, యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయొద్దని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి అన్నారు. పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో సోమవారం కేయూ సెనేట్‌హాల్‌లో ‘యూజీసీ నూతన నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తి’ అనే అంశంపై నిర్వహించిన రాష్ట్ర స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయం ప్రతిపత్తిపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. అందుకే నూతన ముసాయిదాను వెనక్కి తీసుకోవాలన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల్లో నాణ్యమైన విద్య బోధన జరగాలంటే సరిపడా అధ్యాపకుల నియామకాలు జరగాలన్నారు. తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర చైర్మన్, కేయూ రిటైర్డ్ ఆచార్యుడు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్.. యూనివర్సిటీల అభివృద్ధికి ఇచ్చే నిధులు బాగా తగ్గించిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు ఇచ్చే యూజీసీ ఫెలోషిప్స్, స్కాలర్‌షిప్స్‌లో కోత విధించిందన్నారు. యూజీసీ నూతన ముసాయిదాతో యూనివర్సిటీల స్వయంప్రతిపత్తిని కాలరాయడమేనని, ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐఎంఏ న్యూడెమోక్రసీ నగర కార్యదర్శి నున్న అప్పారావు, పీడీఎస్‌యూ జాతీయ నాయకుడు ఇ. విజయ్‌కన్నా, రాష్ట్ర అధ్యక్షుడు మొగిలి వెంకటరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ. సాంబ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్‌సుల్తానా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment