అటవీ జంతువులను వేటాడిన కేసులో ఐదుగురి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన అటవీ అధికారులు
ఖానాపురం: అటవీ జంతువులను వేటాడిన కేసులో ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఎఫ్‌ఆర్‌ఓ రవి కిరణ్, డీఆర్‌ఓ రీనా తెలిపారు. ఈ మేరకు సోమవారం నర్సంపేట రేంజ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఖానాపురం మండలం చిలుకమ్మనగర్‌కు చెందిన మధు, సుమన్, పవన్ కుమార్, అశోక్ నగర్‌కు చెందిన యాకాంబ్రం, సురేశ్, కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంకు చెందిన లవన్ కుమార్ (బాబురావు) ఆదివారం చిలుకమ్మ నగర్ అటవీ ప్రాంతంలో కొండెగొర్రె, కనుజులను వేటాడి నర్సంపేట వైపునకు ఆటోలో తరలిస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్న విషయం విధితమే. ప్రమాద సమయంలో అటవీ జంతువుల మాంసం రోడ్డుపై పడేసి పరారీ కావడంతో విచారణ జరిపిన అధికారులు ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. అశోక్ నగర్‌కు చెందిన యాకాంబ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment