నెల క్రితం ఇంటి నుంచి వెళ్లి.. శవమై కనిపించి..
● వడదెబ్బతో వ్యక్తి మృతి
కేసముద్రం: నెల రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ వ్యక్తి.. సరైన ఆహారం లేక, వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఈ ఘటన కేసముద్రంమున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మగుడి సమీపంలో చోటుచేసుకుంది. ఎస్సై మురళీధర్‌రాజు కథనం ప్రకారం.. పెద్దవంగర మండలం ఉప్పరిగుడెం గ్రామానికి చెందిన దుంపల రాజు(48) నెలరోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ క్రమంలో సోమవారం మున్సిపాలిటీ పరిధి ముత్యాలమ్మగుడి సమీపంలో వ్యక్తి మృతదేహం కనిపించగా స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతుడు పెద్దవంగర మండలం ఉప్పరిగుడెంకు చెందిన రాజుగా గుర్తించారు. సరైన ఆహరం లేక, వడదెబ్బ తగిలి మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతుడి కుమారుడు సాయికుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment