రామప్పలో అమెరికా దేశస్తులు
వెంకటాపురం(ఎం): ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన సుప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని మంగళవారం అమెరికాకు చెందిన షేమ్, ని సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గురించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా రామప్ప అందాలు బాగున్నాయని కొనియాడారు. సరిగమలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని మీటుతూ ముగ్ధులయ్యారు. రామప్ప శిల్పాలను తమ సెల్‌ఫోన్‌లో బంధించుకున్నారు. అనంతరం సరస్సు కట్టకు చేరుకొని సరస్సులో బోటింగ్ చేస్తూ అందాలను తిలకించారు.
Comments
Please login to add a commentAdd a comment