బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
– 8లోu
జిల్లాలో సాగునీటి వనరులు
జిల్లాలోని 1,590 చెరువుల నీటితో మొత్తం 95,460 ఎకరాల భూమి సాగులో ఉంది. జిల్లాలోని ఎస్సారెస్పీ డీబీఎం 58, 59, 60 ద్వారా పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్ నియోజకవర్గాలకు సాగునీరు అందుతోంది. ఇప్పటి వరకు జిల్లాలోని 403 చెరువులు మాత్రమే కాల్వల ద్వారానీరు నింపే అవకాశం ఉండగా.. 1,187 చెరువులు ఇప్పటికీ వర్షాధారంగానే ఉన్నాయి. అయితే జిల్లాలోని నాలుగు లక్షలకు పైగా ఎకరాల భూమి సాగుకు అనుకూలంగా ఉంది. కానీ, సరిపడా నీటి వనరులు లేక ప్రతీ ఏడా ది పంటలు ఎండుతున్నాయి. ఈ బడ్జెట్‌లో పాకాల వరకు వచ్చిన దేవాదులకు, జిల్లా నుంచి వెళ్లే సీతా రామ ప్రాజెక్టుల నీటిని లిప్టుల ద్వారా ఎగువన ఉ న్న చెరువులు నింపితే జిల్లాలోని గూడూరు, గంగా రం, కొత్తగూడ, గార్ల, బయ్యారం, మహబూబా బాద్ మండలాలకు సాగునీటి సమస్య తీరుతుంది.
అరకొరగా సాగునీటి వసతి
● అసంపూర్తిగా వైద్యారోగ్యశాఖ భవనాలు
● పంట ప్రాసెసింగ్ యూనిట్లు లేక ఇబ్బందులు
● నేడు రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క
అసెంబ్లీలో నేడు(బుధవారం) ఆర్థికశాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క ప్రవేశపెట్టే బడ్జెట్‌పై జిల్లా ప్రజలు ఆశగా ఉన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులతోపాటు, పేరుకుపోయిన సమస్యల పరిష్కారానికి ఈ బడ్జెట్‌లోనైనా నిధులు కేటాయిస్తారేమోనని ఎదురుచూస్తున్నారు.
– సాక్షి, మహబూబాబాద్
విద్యాభివృద్ధికి నిధులు..
జిల్లా వ్యాప్తంగా 922 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఇందులో సగం పాఠశాలల్లో ఏదో ఒక సౌకర్యం లేకపోవడం, పలు పాఠశాలల్లో ప్రహరీ గోడలు, మూత్రశాలలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం మన ఊరు– మన బడి,ప్రస్తుత ప్రభుత్వం అమ్మ ఆద ర్శ పాఠశాలల పేరిట నిధులు మంజూ రు చేస్తున్నామని చెప్పారు. కానీ, ఏదీ సంపూర్ణంగా చేయలేదు. ఇందుకు నిధుల కొరతే కారణమని అధికారులు బాహాటంగానే చెబుతున్నారు. అదేవిధంగా జిల్లాలో సోషల్ వెల్ఫేర్‌తోపాటు అన్ని సంక్షేమలశాఖ ద్వారా 31 పాఠశాలలు ఉండగా ఇందులో 16 అద్దె భవనా ల్లోనే కొనసాగుతున్నాయి. వీటికి కొత్త భవనాలు నిర్మించేందుకు నిధులు కేటాయించాలి.
కానరాని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
గిరిజనులు, ఆదివాసీలు ఎక్కువగా ఉన్న జిల్లాలో అత్యధిక మంది వ్యవసా యం, అటవీ సంపద మీదనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రధానంగా వరి, మిర్చి, పసుపు, కూరగాయలు ఎక్కువగా పండించే రైతులు ఉన్నా వాటిని ప్రాసెసింగ్ చేసి లేదా.. నిల్వ చేసి విక్రయించే అవకాశం లేదు. దీంతో రైతులు తక్కువ ధరలకు ఉత్పత్తులను అమ్ముతున్నారు. అదేవిదంగా అడవిలో దొరికే ఇప్ప పువ్వు, తేనె, ఇతర ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేసే యూనిట్లు పెట్టేందుకు నిధులు మంజూరు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
న్యూస్‌రీల్
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
బుధవారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2025
Comments
Please login to add a commentAdd a comment