దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ఉండాలి
● అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో
మహబూబాబాద్: దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం విద్యాశాఖ, అలింకో కంపెనీ ఆధ్వర్యంలో దివ్యాంగ విద్యార్థులకు ఉచితంగా ఉపకరణాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దివ్యాంగులకు కల్పిస్తున్న పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. దివ్యాంగ విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించడంతోపాటు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో డీఈఓ రవీందర్‌రెడ్డి, సహిత విద్యా జిల్లా కోఅర్డినేటర్ ఆజాద్ చంద్రశేఖర్, ఏడీ రాజేశ్వరరావు, డీఎస్‌ఓ అప్పారావు, అలింకో కంపెనీ ఇంచార్జ్‌లు సురేష్, మోహిత్ తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబాబాద్ అర్బన్/ మహబూబాబాద్: ప్రధానమంత్రి ఇంటర్న్ షిప్ పథకానికి అర్హులైన యువత నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీమన్నారాయణరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్న్‌షిప్‌కు ఎంపికై న యువకులకు నెలకు రూ.5వేల నుంచి రూ.6వేలు భత్యం అందుతుందని తెలిపారు. శిక్షణ 12 నెలలు కొనసాగుతుందని తెలిపారు. 21 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండి, కుటుంబంలో ఎవరూ ప్రభుత్వ ఉద్యోగి లేని వారికి అవకాశం ఉంటుందని తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ డిప్లమా, డిగ్రీ పూర్తి చేసి ఉండాలని, కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.8 లక్షల లోపు ఉండాలని తెలిపారు. అర్హత కలిగిన వారు ఈనెల 31వ తేదీ వరకు pminternship.mca.gov.in వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని, మరిన్ని వివరాలకు 1800 116090 నంబర్ ద్వారా సంప్రదించాలని కోరారు.
ఆహారం కల్తీ చేస్తే
కఠిన చర్యలు
డోర్నకల్: ఆహార పదార్థాలను కల్తీ చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రోహిత్ హెచ్చరించారు. స్థానిక మెయిన్ రోడ్డులోని హోటళ్లు, స్వీట్ హోమ్స్, బేకరీలు, జ్యూస్ పాయింట్లు, మిర్చి, బజ్జీ బండ్లలో మంగళవారం ఆయన ఆకస్మికంగా తని ఖీలు నిర్వహించారు. కల్తీ నూనెతో తయారు చేసిన బజ్జీలు, మిర్చీలను గుర్తించి కాల్వలో పడేశారు. హోటళ్లలో పరిశుభ్రత పాటించని ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. జ్యూస్ పాయింట్లు, స్వీట్ హోముల నుంచి ఆహార పదార్థాలు, జ్యూస్ నమూనాలు సేకరించారు. కల్తీ ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
రూ.3.63 లక్షల విలువైన
నల్లబెల్లం పట్టివేత
మహబూబాబాద్ రూరల్: జిల్లా కేంద్రంలోని గుండ్లకుంట కాలనీలో రూ.3.63 లక్షల విలువ గల తొమ్మిది క్వింటాళ్ల నల్లబెల్లం, 10 కిలోల పటిక, ఐదు లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకున్నామని మహబూబాబాద్ టౌన్ సీఐ పెండ్యాల దేవేందర్ మంగళవారం తెలిపారు. జిల్లా కేంద్రంలో టౌన్ ఎస్సై కె.శివ తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ చేస్తుండగా విశ్వసనీయ సమాచారం వచ్చిందన్నా రు. దీంతో గుండ్లకుంట కాలనీ ప్రాంతానికి చేరుకు ని తనిఖీలు నిర్వహించగా నల్లబెల్లం, పటిక, గు డుంబా లభ్యమయ్యాయని తెలిపారు. టౌన్ ఎస్సై శివ ఫిర్యాదు మేరకు మరో టౌన్ ఎస్సై అలీమ్ హుస్సేన్ నల్లబెల్లం అక్రమ రవాణాకు సంబంధించి పెసర రమేశ్‌పై కేసు నమోదు చేశారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment