విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దు
మహబూబాబాద్ రూరల్: పదో తరగతి విద్యార్థులు విద్యార్థులు ఒత్తిడికి గురికావొద్దని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి సూచించారు. మహబూబాబాద్ మండలంలోని కంబాలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఎంశ్రీ వార్షికోత్సవం, పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా డీఈఓ రవీందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ.. కంబాలపల్లి పాఠశాల జిల్లాలోనే ప్రాముఖ్యత కలిగి ఉన్నదని, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఏ పో టీలు నిర్వహించినా ఈ పాఠశాల విద్యార్థులు తప్పనిసరిగా బహుమతి పొందుతారని అన్నారు. వివిధ సబ్జెక్టు టాలెంట్ టెస్టుల్లో కూడా బహుమతులు సాధిస్తారని తెలిపారు. పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించి పాఠశాలకు పేరుతేవాలని, రాష్ట్ర స్థాయిలో జిల్లాను సింగిల్ డిజిట్‌కు తీసుకురావాలని సూచించారు. విద్యార్థులకు స్పెషల్ టెస్టులు నిర్వహించడం ద్వారా మంచి ప్రోగ్రెస్ ఉంటుందని, ఉపాధ్యాయులు అందరి కృషి వల్ల ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయని ఆకాంక్షించారు. కార్యక్రమములో ఎంఈఓ వెంకటేశ్వర్లు, హెచ్‌ఎం రమేష్ బాబు, మైస శ్రీనివాస్, వీరయ్య, విష్ణువర్ధన్, రామసహాయం శ్రీధర్ రెడ్డి, ఉప్పలయ్య, సోహెన్ బీ, శ్రీనివాసరావు, తిరుపతి, సతీష్ కుమార్, శిభారాణి, సోమేశ్వర్, ఝాన్సీ, మల్లారెడ్డి, వెంకటేశ్వర్లు, కృష్ణమూర్తి, వీరభద్రం, వెంకటేశ్వర్లు, యుంగేందర్, కవిత పాల్గొన్నారు.
డీఈఓ రవీందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment