లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
కాటారం: మహాముత్తారం మండలానికి చెందిన ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితుడికి పది సంవత్సరాల ఆరు నెలల కఠిన జైలు శిక్షతో పాటు రూ.1500 జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు మంగళవారం తీర్పు వెలువరించారు. మహాముత్తారం ఎస్సై మహేందర్‌కుమార్ కథనం ప్రకారం.. మహాముత్తారం మండలం మహబూబ్‌పల్లికి చెందిన అర్నేని నరేశ్ 2015లో ఓ వివాహిత రాత్రి ఒంటరిగా ఇంట్లో నిద్రిస్తుండగా ఆమైపె లైంగికదాడికి పాల్పడ్డాడు. సదరు మహిళ కేకలు వేయగా చుట్టు పక్కల వారు రావడంతో నరేశ్ పారిపోయాడు. మరుసటి రోజు వివాహిత ఈ విషయం తన భర్తకు చెప్పడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్సై వెంకటేశ్వరరావు.. నరేశ్‌పై కేసు నమోదు చేయగా అప్పటి సీఐ మహేశ్ చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కొన్ని రోజులుగా కోర్టులో విచారణ కొనసాగగా డీఎస్పీ గడ్డం రామ్మోహన్‌రెడ్డి, సీఐ నాగార్జునరావు, ఎస్సై మహేందర్‌కుమార్ ఆధ్వర్యంలో సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో భాగంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీనివాస్ వాదనలు వినిపించగా నేరం రుజువైంది. దీంతో నరేశ్‌కు పదేళ్ల ఆరు నెలల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.1500 జరిమాన విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నారాయణబాబు తీర్పు వెల్లడించారు. నిందితుడికి శిక్షపడేలా సమర్థవంతంగా విధులు నిర్వర్తించిన డీఎస్పీ, సీఐ, ఎస్సైతో పాటు సాక్షులను సకాలంలో ప్రవేశపెట్టిన కోర్టు సిబ్బందిని ఎస్పీ కిరణ్‌ఖరే అభినందించారు.
హత్యాయత్నం కేసులో భర్తకు ఐదేళ్లు..
మహబూబాబాద్ రూరల్ : భార్యను అదనపు కట్నం కోసం వేధించడంతోపాటు ఆమెను హత్యచేయాలని ప్రయత్నించిన భర్తకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా విధిస్తూ మహబూబాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సి.సురేశ్ మంగళవారం తీర్పు వెలువరించారు. కోర్టు డ్యూటీ అధికారి, హెడ్ కానిస్టేబుల్ నెలకుర్తి అశోక్ రెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గడ్డిగూడెం తండా గ్రామానికి చెందిన ధరావత్ రవికి మానుకోట జిల్లా కేంద్రంలోని శిఖార్‌ఖానా గడ్డకు చెందిన భవానితో 2017లో వివా హం జరిగింది. ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమార్తె మహిమ ఉంది. భవానీని రవి, అతడి తల్లిదండ్రులు కాంతి, ఉమ్లా, ఆడపడుచు దంపతులు లక్ష్మి, విష్ణు అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు గురిచేశారు. భర్త రవి ఉరేసి చంపే ప్రయత్నం చేయగా భవాని 2021 ఫిబ్రవరి 22వ తేదీన రూరల్ పో లీసులకు ఫిర్యాదు చేసింది. అప్పటి ఎస్సై చీర రమేశ్ బాబు కేసు నమోదు చేయగా విచారణ జరిపి అప్పటి ఎస్సై సి.హెచ్.నగేశ్ కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ పక్షాన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సంతోషిణి, గణేశ్ ఆనంద్ కోర్టులో వాదనలు వినిపించగా ప్రస్తుత రూరల్ సీఐ సర్వయ్య, ఎస్సై దీపిక ఆధ్వర్యంలో కోర్టు డ్యూటీ అధికారి అశోక్‌రెడ్డి సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. వాదనలు విన్న అసిస్టెంట్ సెషన్స్ జడ్జి సి.సురేశ్.. రవికి ఐదేళ్ల జైలు శిక్ష, రూ.7 వేలు జరిమానా జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.
Comments
Please login to add a commentAdd a comment