భూ నిర్వాసితులకు న్యాయం చేస్తాం
ఖిలా వరంగల్ : మామునూరు ఎయిర్‌పోర్ట్ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం వరంగల్ నక్కలపల్లి , గాడిపల్లి గ్రామాల్లో తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, ఆర్‌అండ్‌బీ, హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులు, రైతులతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే ద్వారా గుర్తించిన 253 ఎకరాల భూములతోపాటు బావులు, బోర్లును పరిశీలించారు. బోర్లు, బావుల నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని అంచనా వేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం ఆర్టీఓ మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్వర్వుల ప్రకారం విమానాశ్రయం రన్‌వే విస్తీర్ణం కోసం 253 ఎకరాల భూమిని సేకరించే పనిలో ఉన్నామని, సర్వే ద్వారా నక్కలపల్లి, గాడిపల్లి గ్రామాల్లో 253 ఎకరాలను గుర్తించమన్నారు. భూమి విలువతోపాటు బావులు, బోర్లు విలువను సైతం పరిహారంలో చెల్లిస్తామని తెలిపారు. ప్రతీ రైతుకు న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని, త్వరలో నివేదిక తయారు చేసి కలెక్టర్‌కు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల ఆర్‌ఐ ఆనంద్ కుమార్, సర్వేయర్ రజిత, ఇతర శాఖల సిబ్బంది, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.
శరవేగంగా రన్‌వే భూ సేకరణ పనులు
వరంగల్ ఆర్డీఓ సత్యపాల్‌రెడ్డి
నక్కలపల్లి, గాడిపల్లిలో బావులు, బోర్ల పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment