సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి..
టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడు
టెక్నాలజీకి హ్యుమన్ స్పిరిట్ తోడవడంతోనే సునీతా విలియమ్స్ ధైర్యంగా పరిశోధనలకు అంతరిక్షంలోకి వెళ్లింది. ఎనిమిది రోజుల కోసం అంతరిక్షం వెళ్లి అక్కడే చిక్కుకుంది. 9 నెలలు వివిధ ప్రయోగాలు నిర్వహించింది. బుధవారం తెల్లవారుజామున క్షేమంగా భూమిపై ల్యాండ్ అయ్యింది. సునీతా విలియమ్స్ అంతరిక్ష పరిశోధనలు చేపట్టేందుకు యువ శాస్త్రవేత్తలకు దిక్సూచిగా నిలుస్తారు.
–అబ్దుల్ అజిమ్, ఫిజిక్స్ ప్రొఫెసర్, నిట్
భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి అని పలువురు సైన్స్ మాజీ అధికారులు, ప్రొఫెసర్లు అన్నారు. ప్రయోగాల నిమిత్తం 9 నెలల క్రితం అంతర్జాతీయ అంతరిక్షంలోకి వెళ్లిన సునీతావిలియమ్స్ బుధవారం తెల్లవారుజామున భూమిపై సురక్షింతగా ల్యాండ్ అయ్యారు. దీనిపై భారత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. కాగా, సునీతావిలియమ్స్ 9 నెలల సమయంలో అంతరిక్షంలో 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు.
–కాజీపేట అర్బన్
సునీతావిలియమ్స్ భావితరాలకు స్ఫూర్తి..
Comments
Please login to add a commentAdd a comment