హెల్త్ యూనివర్సిటీ వీసీ బాధ్యతల స్వీకరణ
ఎంజీఎం: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం నూతన వైస్ చాన్స్‌లర్‌గా డాక్టర్ పీవీ నందకుమార్‌రెడ్డి బుధవారం అధికారికంగా తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్సిటీ ప్రతిష్టను పెంచేందుకు అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. అనంతరం వర్సిటీలోని పలు విభాగాలను పరిశీలించి సిబ్బందితో ముచ్చటించారు. నూతన వీసీగా బాధ్యతలు చేపట్టిన నందకుమార్‌రెడ్డికి రిజిస్ట్రార్ డాక్టర్ సంధ్య, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ మల్లేశ్వర్, జాయింట్ రిజిస్ట్రార్ డాక్టర్ రమేశ్, అడ్మిషన్ కమిటీ మెంబర్ డాక్టర్ ప్రవీణ్‌కుమార్, డిప్యూటీ రిజిస్ట్రార్ డాక్టర్ హేమంత్‌కుమార్, ఫైనాన్స్ ఆఫీసర్ ఖాలీద్, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment