మందులు వాడితే టీబీ వ్యాధి నయం
నెహ్రూసెంటర్: క్రమం తప్పకుండా మందులు వాడితే టీబీ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని, వ్యాధి నివారణపై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని డీఎంహెచ్‌ఓ మురళీధర్ అన్నారు. వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో టీబీ నియంత్రణ దినోత్సవ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ.. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని నయం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా టీబీ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ విజయ్‌కుమార్, డాక్టర్ శ్రావణ్, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెచ్‌ఈ కేవీ రాజు, టీబీ ప్రోగ్రాం మేనేజర్ నీలిమాశ్వేత, కోఆర్డినేటర్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.
ఆశకార్యకర్తలకు
ఫిక్స్‌డ్ వేతనం ఇవ్వాలి
మహబూబాబాద్: ఆశకార్యకర్తలకు ఫిక్స్‌డ్ వేతనం రూ.18,000 చెల్లించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్ళి కుంట ఉపేందర్ డిమాండ్ చేశారు. బుధవారం సీఐటీయు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆశకార్యకర్తలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కుంట ఉపేందర్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఆశకార్యకర్తలకు ఇచ్చిన హామీ లను అమలు చేయాలన్నారు. పీఎఫ్, ఈఎస్‌ఐ తో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఏఎన్‌ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశలకు ఎస్‌ఎన్‌ఎం పోస్టుల్లో ప్రమోషన్ కల్పించాలన్నారు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్ కల్పించాలని, టార్గెట్లు రద్దు చేయాలన్నారు. డిమాండ్లు పరిష్కరించాలని, లేని ఝెడల ఈ నెల 24న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నా యకులు నాగన్న, మల్లయ్య, ఉపేంద్ర, రమాదేవి, నళిని, స్వరూప, రమ, ఆసియా, విజయ, జయసుధ, నిర్మల తదితరులు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ తనిఖీ
నర్సింహులపేట: మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను బుధవారం ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణ, గదులను పరిశీలించిన అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. మండలంలోని శాంతిభద్రతలు, కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసులు పెండింగ్ ఉండొద్దని, వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లు, సైబర్ నేరాలపై గ్రామాల్లో అవగాహన పెంచాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తొర్రూరు డీఎస్పీ కృష్ణకిశోర్, తొర్రూరు సీఐ గణేశ్, డీసీఆర్బీ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, సైబర్ క్రైం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై మాలోతు సురేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
నేడు బయ్యారంలో
మంత్రి సీతక్క పర్యటన
బయ్యారం: బయ్యారం మండలంలోని పలు గ్రామాల్లో గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క పర్యటించనున్నట్లు ఇల్లెందు ఎమ్మెలే కనకయ్య బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మండలంలోని గౌరారం వట్టేరు బ్రిడ్జి, కోడిపుంజులతండా–వినోభానగర్, బయ్యారం–కోటగడ్డ రహదారి నిర్మాణపనుల శంకుస్థాపనతో పాటు మొట్లతిమ్మాపురం బ్రిడ్జిని మంత్రి ప్రారంభిస్తారన్నారు. మంత్రితో పాటు ఎంపీ బలరాంనాయక్ తదితరులు పాల్గొంటారని ఎమ్మెల్యే చెప్పారు.
మందులు వాడితే టీబీ వ్యాధి నయం
Comments
Please login to add a commentAdd a comment