బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్‌కు నిధుల ప్రతిపాదనలు ఇలా..
బడ్జెట్ కేటాయింపుల్లో ప్రత్యక్షంగా ఉమ్మడి వరంగల్‌కు ప్రతిపాదించిన నిధుల వివరాలు ఇలా ఉన్నాయి. సాగునీటిరంగం కేటాయింపుల్లో జేఎస్ భూపాలపల్లి జిల్లా మేడిగడ్డ నుంచి ఉమ్మడి ఏడు జిల్లాలకు విస్తరించి ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ.2,685 కోట్లు ప్రతిపాదించింది. ఇందులో పనుల కంటే పెండింగ్ బిల్లుల చెల్లింపులకే ఎక్కువ ప్రాధాన్యం ఉండే అవకాశం ఉంది.
● ప్రస్తుతం 91 శాతం పనులు పూర్తయి.. భూసేకరణ జరగక అసంపూర్తిగా ఉన్న దేవాదుల ప్రాజెక్టు కోసం రూ.245 కోట్లు ఇచ్చారు. ఏఐబీపీ కింద రెండు పద్దుల్లో మరో రూ.58 కోట్లను పేర్కొన్నారు.
● స్మార్ట్‌సిటీ పనుల కోసం రూ.179.09 కోట్లు, ఎస్సారెస్పీ స్టేజ్–2కు రూ.25 కోట్లు, కాకతీయ యూనివర్సిటీకి రూ.50 కోట్లు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌కు రూ.50 కోట్లు కేటాయించారు. మామునూరు వెటర్నరీ సైన్స్ కళాశాలకు రూ.25 కోట్లు, కాళేశ్వరం టూరిజం సర్క్యూట్‌కు రూ.10 కోట్లు, టీఎస్ స్పోర్ట్స్ స్కూల్స్ కోసం వరంగల్, కరీంనగర్‌కు కలిపి రూ.41 కోట్లు ప్రతిపాదించారు.
● రామప్ప, పాకాలకు ఐదేసి కోట్ల రూపాయలు, లక్నవరానికి రూ.2 కోట్లు, మల్లూరువాగుకు రూ.కోటి, కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి రూ.2 కోట్లు బడ్జెట్‌లో ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment