సీఎంను దూషించిన కేసులో ఒకరి అరెస్ట్
నెల్లికుదురు: జిల్లాలోని ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామానికి చెందిన దర్శనం వెంకటయ్య హైదరాబాద్‌లో ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని అసభ్యకరమైన పదజాలంతో దూషిస్తూ మాట్లాడిన ఘటనలో అక్కడి సీసీఎస్ పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఈ మేరకు వెంకటయ్య భార్య దర్శనం లక్ష్మి, తల్లి ఇద్దమ్మ విలేకరులతో మాట్లాడుతూ వెంకటయ్య ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తుండగా పోలీసులు వచ్చి ‘సీఎంను తిట్టినావట’ అంటూ తీసుకెళ్లారని తెలిపారు. వెంకటయ్య బీపీ, షుగర్‌తో బాధపడుతున్నాడని చెప్పినా పోలీసులు వినకుండా తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. నా భర్తను క్షేమంగా ఇంటి వద్ద వదిలిపెట్టాలని భార్య లక్ష్మి ప్రభుత్వాన్ని కోరింది.
నా భర్తను క్షేమంగా వదిలిపెట్టాలి
దర్శనం వెంకటయ్య భార్య లక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment