మహారాష్ట్రలో సమ్మయ్య బృందం ప్రదర్శన | - | Sakshi
Sakshi News home page

మహారాష్ట్రలో సమ్మయ్య బృందం ప్రదర్శన

Published Thu, Mar 20 2025 1:49 AM | Last Updated on Thu, Mar 20 2025 1:45 AM

మహారాష్ట్రలో సమ్మయ్య  బృందం ప్రదర్శన

మహారాష్ట్రలో సమ్మయ్య బృందం ప్రదర్శన

దేవరుప్పుల: మహారాష్ట్రలోని సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ కల్చరల్‌ సెంటర్‌ నాగ్‌పూర్‌ ఆధ్వర్యంలో అమరావతి విశ్వవిద్యాలయంలో బుధవారం తలపెట్టిన లోక్‌ మాన్య సమరోత్సాహం–2025లో పద్మశ్రీ గ్రహీత గడ్డం సమ్మయ్య బృందం సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూకై లాస్‌ యక్షగాన నాటకం వేసి తెలంగాణ గ్రామీణ ప్రాంత సాంస్కృతిక కళా ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా నిర్వాహకులు సమ్మయ్యను ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందించారు. కార్యక్రమంలో గడ్డం రఘుపతి, శ్రీపతి, సోమరాజు, ప్రభాకర్‌, ముకుందం, మురళీకృష్ణ, గోవర్ధన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement