ఉత్పాదకతలో ఎంఎస్‌ఎంఈ పాత్ర కీలకం
హన్మకొండ: స్థూల ఉత్పాదకత, ఉపాధి కల్పనలో సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా సంస్థ (ఎంఎస్‌ఎంఈ) కీలక భూమిక పోషిస్తోందని కామన్ వెల్త్ విజిటింగ్ ఫెల్లో యునైటెడ్ కింగ్‌డమ్, గ్లోబల్ అసోసియేషన్ ఫర్ ఎంఎస్‌ఎంఈఎస్ కో ఫౌండర్ ప్రొఫెసర్ హిమాచలం దాస రాజు అన్నారు. హనుమకొండ నయీంనగర్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ ఇన్నోవేషన్ త్రో ఎంఎస్‌ఎంఈఎస్ అనే అంశంపై జాతీయ సెమినార్ బుధవారం జరిగింది. ఈసందర్భంగా రాజు మాట్లాడుతూ.. దేశ జీడీపీలో 30 శాతం, ఉద్యోగ కల్పనలో 40 శాతం, ఉత్పాదక రంగంలో 45 శాతం మేర సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా సంస్థ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాజేందర్, ప్రొఫెసర్ అమరవేణి, డాక్టర్ మహేందర్ కు మార్, వాగ్దేవి కళాశాల అకడమిక్ డైరెక్టర్ వాహినీ దేవి, ప్రిన్సిపాల్ ఎ.శేషాచలం, కాన్ఫరెన్స్ కన్వీనర్లు పి.సుగుణాకర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, కో కన్వీనర్ ఎ.రజిని కుమార్, కోఆర్డినేటర్లు బి.కిశోర్ కుమార్, టి.అ నూష, సీహెచ్.కరుణ, బి.చంద్రకళనాయక్, శాంభవి, డాక్టర్ ఎం.అరవింద తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment