బడ్జెట్‌పై సమాచారంతో సిద్ధంగా ఉండాలి..
● సమీక్షలో మేయర్, కమిషనర్
వరంగల్ అర్బన్: గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ సమావేశంలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌పై ప్రతీ సభ్యుడు అడిగే ప్రశ్నలకు బాధ్యతాయుతంగా సమాధానాలు అందించాల్సిన బాధ్యత మీపై ఉందని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను హెచ్చరించారు. బుధవారం బల్దియా కార్యాలయంలో గురువారం 2025–26 బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మేయర్, కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వింగ్ అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేశారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. అధికారులు ఆదాయ, వ్యయాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ జోనా, సెక్రటరీ అలివేలు, బయాలజిస్ట్ మాధవరెడ్డి, ఇన్‌చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, హెచ్‌ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్ ఈఈలు తదితరులు పాల్గొన్నారు.
గేట్‌లో రేవంత్‌కుమార్‌కు
ఫస్ట్ ర్యాంక్
వరంగల్: గేట్–2025 (అగ్రికల్చర్ ఇంజనీరింగ్ విభాగం)లో వరంగల్ దేశాయిపేటకు చెందిన కీర్తి రేవంత్‌కుమార్ జాతీయ స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించాడు. గేట్ పరీక్షలో 100 మార్కులకు 74.67 మార్కులు సాధించి మొదటి ర్యాంకు పొందాడు. రేవంత్ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను స్థానికులు అభినందించారు.
బడ్జెట్‌పై సమాచారంతో సిద్ధంగా ఉండాలి..
Comments
Please login to add a commentAdd a comment