ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా
వరంగల్: కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు నిర్మాణంలో భూములు కోల్పోయి నష్టపరిహారం రాని కొంతమంది రైతులు హనుమకొండలోని వరంగల్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా బాధితులు మాట్లాడుతూ.. మెగా టెక్స్‌టైల్ పార్కులో తమ భూములను తీసుకున్న రెవెన్యూ అధికారులు నష్టపరిహారం ఇప్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తమ బాధను ఆర్డీఓ, కలెక్టర్ తెలిపేందుకు వచ్చామని, ఇప్పటిౖకై నా పరిహారాన్ని వెంటనే 15 రోజుల్లో చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. పురుగుల మందు డబ్బాతో వచ్చి ధర్నా చేయడంతో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కార్యక్రమంలో భూనిర్వాసితుల సంఘం నాయకుడు సముద్రాల యాకస్వామి తదితరులు పాల్గొన్నారు.
పురుగుల మందు డబ్బాలతో
భూనిర్వాసితుల ఆందోళన
టెక్స్‌టైల్ పార్కులో భూములు కోల్పోయినా పరిహారం ఇవ్వలేదని ఆవేదన
Comments
Please login to add a commentAdd a comment