సౌర ప్లాంట్‌తో రైతులు ఆర్థికంగా బలోపేతం
హన్మకొండ: సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ, తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీజీ రెడ్‌కో) సంయుక్తంగా శనివారం ఎన్పీడీసీఎల్ పరిధిలోని 16 సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్ల కార్యాలయంలో ‘కుసుమ్’ పథకం కింద దరఖాస్తు చేసుకున్న రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం నుంచి సీఎండీ వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడారు. రైతులు సౌర శక్తిని ఉత్పత్తి చేసి మరింత ఆదాయం సమకూర్చుకోవడానికి ఇది సువర్ణ అవకాశమన్నారు. సోలా ర్ ద్వారా ఉత్పత్తి చేసిన ప్రతీ యూనిట్‌కు రూ.3.13 ఇస్తామని, ప్రతీ నెల రైతు ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. రూ.2 కోట్ల వరకు ఆరు శాతం వడ్డీకి బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. దరఖాస్తు చేసుకున్న రైతులు ఈ నెల 28 వరకు రూ.లక్ష పూచీకత్తు సొమ్ము డిపాజిట్ చేయాలన్నా రు. టెండర్ ప్రక్రియ పూర్తి కాగానే పూచీకత్తు సొ మ్ము చెల్లిస్తామన్నారు. 25 ఏళ్ల అగ్రిమెంట్‌తో రైతులు లాభాలతో కూడిన నిలకడ ఆదాయం పొందొచ్చన్నారు. కార్యక్రమంలో చీఫ్ ఇంజనీర్లు కె.వెంకటరమణ, రాజుచౌహాన్, జీఎం మల్లికార్జున్, టీజీ రెడ్కో డీజీఎం. వెంకటరమణ, డీఈలు అమర్‌నాథ్, సంపత్‌రెడ్డి, ఏఈ శ్రీపాల్ పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment