చేపల పెంపకంతో ఆర్థికంగా ఎదగాలి
మామునూరు : చేప పిల్లల పెంపకంతోపాటు చేప పిల్లల ఉత్పత్తికేంద్రాలు, నర్సరీలు ఏర్పాటు చేసుకుని గ్రామీణ నిరుద్యోగ యువత, మహిళా రైతులు ఆర్థికంగా ఎదగాలని మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న సూచించారు. ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి వి జ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జాతీయ మత్స్య అభివృద్ధి మండలి, హైదరాబాద్ సౌజన్యంతో నర్సరీల్లో తెల చేపల పెంపకంపై ఐదు రోజుల శిక్షణ శిబిరం సోమవారం ప్రారంభమైంది. ఆయన ముఖ్యఅ తిథిగా హాజరై శిక్షణ శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత మహిళలు, నిరుద్యోగ యువత ముందుకు వచ్చి నర్సరీల్లో చేపల పంపకం చేపడితే లాభాలు అర్జించొచ్చని పేర్కొన్నారు. అనంతరం చేపల పెంపకం, చేపలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. శాస్త్రవేత్తలు జె.సాయి కిరణ్, గణేశ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.
మూమునూరు కేవీకే కోఆర్డినేటర్ రాజన్న
Comments
Please login to add a commentAdd a comment