మార్కెట్‌కు 16 టన్నుల మామిడి
వరంగల్: వరంగల్ ఏనుమాముల పరిధిలోని ముసలమ్మకుంట సమీపంలో ఏర్పాటు చేసిన మార్కెట్‌కు 21 వాహనాల్లో 16 టన్నుల మామిడి అమ్మకానికి వచ్చింది. గరిష్ట ధర క్వింటాకు రూ.10వేలు, కనిష్ట ధర రూ.2వేలు (రాలిన కాయలు), మోడల్ ధర రూ.6,700 పలికినట్లు ఉద్యోగులు తెలిపారు.
దారి తవ్వకంతో రాకపోకలకు
అంతరాయం
మామిడి మార్కెట్‌కు వెళ్లే దారిని ఆ స్థల యాజమానులు తవ్వడంతో రైతులు, వ్యాపారులు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. ఈవిషయం తెలిసిన మార్కెట్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని స్థలానికి సంబంధించిన పత్రాలు తీసుకురావాలని పేర్కొనడంతో స్థల యజమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా, వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి యార్డులో వ్యాపారిపై హమాలీ చేయి చేసుకున్నట్లు తెలిసింది. ఈవిషయంపై వ్యాపార వర్గాలను విచారించగా దాట వేశారు.
నాట్యాచార్యులు సుధీర్‌రావుకు జాతీయస్థాయి ఫెలోషిప్
హన్మకొండ కల్చరల్ : నగరానికి చెందిన నాట్యాచార్యులు, సద్గురు శివానంద నృత్యమాల వ్యవస్థాపకుడు బొంపల్లి సుధీర్‌రావు కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల శాఖ నుంచి జాతీయస్థాయి సీనియర్ ఫెల్‌షిప్‌నకు ఎంపికయ్యారు. ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా అత్యుత్తమ నాట్యకళాకారులను తీర్చిదిద్దిన సుధీర్‌రావు జిల్లాకు అవార్డులు తేవడం ప్రారంభించారు.
ఇద్దరు దొంగల అరెస్ట్
వరంగల్ క్రైం: తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను సుబేదారి పోలీసులు అరెస్ట్ చేసినట్లు హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన నిమ్మల వినయ్‌కుమార్, భద్రాది కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపేట మండలం అనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన తంబళ్ల నితిన్ తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. బంగారు ఆభరణాలు, నగదు చోరీకి పాల్పడుతున్నారు. ఈనెల 19న సంతోశ్‌నగర్ కాలనీలో విజయగిరి రాజు తన ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగా తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణరెడ్డి సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా, స్థానిక ఇంటెలిజెన్స్‌ను వినియోగించుకుని సోమవారం అదాలత్ వద్ద నిందితులను గుర్తించి విచారించగా.. నేరం ఒప్పుకున్నారు. నిందితుల నుంచి రూ.1.70 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు, రూ. 90 వేలు స్వాధీ నం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
మార్కెట్‌కు 16 టన్నుల మామిడి
మార్కెట్‌కు 16 టన్నుల మామిడి
Comments
Please login to add a commentAdd a comment