మహబూబాబాద్ రూరల్: మహిళలపై జరిగే నేరాలను పూర్తిగా అరికట్టేందుకు షీ టీమ్స్, మహిళా పోలీస్‌స్టేషన్ కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అన్నారు. షీ టీమ్స్ కార్యాలయం, మహిళా పోలీస్ స్టేషన్‌ను సోమవారం సందర్శించి, మహిళా భద్రత, హక్కుల పరిరక్షణ, కేసుల ప్రగతి మొదలైన అంశాలపై ఎస్పీ సమీక్ష నిర్వహించారు. కాలేజీలు, కార్యాలయాలు, బస్టాండ్లు, పబ్లిక్ ప్రాంతాల్లో మహిళల రక్షణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. ఈవ్ టీజింగ్, సైబర్ నేరాలు, వేధింపుల ఆపరేషన్ల గురించి ఆర్‌ఎస్సై సు నందను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మహిళల భద్రతకు సంబంధించి హెల్ప్ లైన్ నంబర్లను విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. నేర నివేదికలు, పెండింగ్ కేసులు, బాధితులకు అందిస్తున్న సహాయం, కౌన్సెలింగ్ సేవలు, స్టేషన్‌లో మహిళా సిబ్బంది సంఖ్య గురించి తెలుసుకున్నా రు. బాధిత మహిళలతో మాట్లాడి వారికి పోలీసు శాఖ నుంచి అందించాల్సిన సహాయంపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. పోక్సో, గృహహింస, వేధింపుల కేసుల్లో బాధితులకు తక్షణ న్యాయం అందించేందుకు వేగంగా చర్యలు తీసుకోవాల న్నారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐ చంద్రమౌళి, రూరల్ సీఐ సరవయ్య, ఎస్సై దీపిక, ఆర్‌ఎస్సై సునంద, ఎస్సై ఆనందం, సిబ్బంది పాల్గొన్నారు.
ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్