
రజతోత్సవ మహాసభపై సమీక్ష
బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించతలపెట్టిన పార్టీ రజతోత్సవ మహాసభ ఏర్పాట్లపై మంగళవారం పార్టీ అధినేత కేసీఆర్‌తో ఎర్రవెల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా నేతలు సమావేశమయ్యారు. సమావేశంలో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, తాటికొండ రాజయ్య, సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, దాస్యం వినయ్‌భాస్కర్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యానాయక్, శంకర్ నాయక్, గండ్ర వెంకట రమణారెడ్డి, నన్నపునేని నరేందర్, నాయకులు లక్ష్మణ్‌రావు, గండ్ర జ్యోతి, నాగజ్యోతి పాల్గొన్నారు.