
తాగునీటి సమస్య ఉండొద్దు
మహబూబాబాద్: వేసవిలో తాగునీటి ఇబ్బందులు లేకుండా సంబంఽధిత శాఖల అధికారులు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా ప్రత్యేక అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సంబంధిత అధికారులతో తాగునీటి సరఫరా, రాజీవ్ యువ వికాసం, పెన్షన్లు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకం అందరికి తెలిసేలా చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీటి సమస్య ఉన్న ప్రాంతాలను గుర్తించి పరిష్కరించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు లెనిన్ వత్సల్ టొప్పో, కె.వీర బ్రహ్మచారి, డీఆర్‌డీఏ పీడీ మధుసూదన్‌రాజు, జెడ్పీ ఈసీఓ పురుషోత్తం, డీపీఓ హరిప్రసాద్, అధికారులు పాల్గొన్నారు.
దివ్యాంగులకు యూడీఐడీ కార్డులు
దివ్యాంగులకు యూడీఐడీ (యూనిక్ డిసెబిలిటీ ఐడీ) నంబర్‌ను కేటాయించి స్మార్ట్ కార్డులు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. అందుకోసం ప్రత్యేక పోర్టల్‌ను ఏ ర్పాటు చేసిందన్నారు. వివరాలు ఆ పోర్టల్‌లో అప్ లోడ్ చేయాలన్నారు. అప్‌లోడ్ చేసిన అనంతరం సదరం శిబిరం నిర్వహించే కేంద్రాల్లో దగ్గర ఉండేదాన్ని ఎంచుకోవాలన్నారు. డిజిటల్ సంతకంతో స్మార్ట్‌కార్డు పోస్టు ద్వారా ఇంటి చిరునామాకు పంపిస్తారన్నారు.కార్డులో ఐడీ నంబర్,దివ్యాంగుడి పే రు,వైకల్యశాతం,తదితర వివరాలు ఉంటాయన్నా రు. ఆ కార్డుతో రైళ్లు, బస్సు టికెట్లలో రాయితీలు, ఫించన్ తదితర ప్రయోజనాలు ఉంటాయన్నారు.
కలెక్టరేట్‌లో సర్వాయి పాపన్న వర్ధంతి
కలెక్టర్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని నిర్వహించారు. కలెక్టర్ అద్వైత్‌కుమార్‌సింగ్ పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పి ంచారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కె వీర బ్రహ్మచారి, బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి నర్సింహస్వామి, నాయకులు వెంకన్న, వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
నాణ్యమైన భోజనం అందించాలి
కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్
గార్లలోని పలు పాఠశాలల్లో
ఆకస్మిక తనిఖీ
గార్ల: ప్రభుత్వం అమలు చేస్తున్న కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ వార్డెన్లను ఆదేశించారు. బుధవారం గార్లలోని ఆశ్రమ, కేజీబీ వీ పాఠశాలలను కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆశ్రమ పాఠశాలలోని కిచెన్ షెడ్, స్టోర్‌రూంలను పరి శీలించారు. వసతిగృహాల్లో నీటి సమస్య లే కుండా చూసుకోవాలన్నారు. టాయిలెట్లు, వాష్ రూంలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నా రు. అనంతరం కస్తూర్భాగాంధీ పాఠశాలను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. వార్షిక పరీక్షలు ఎలా రాసారని అడిగి తెలుసుకున్నారు. చదువుకుంటేనే భవిష్యత్‌లో ఉన్నత శిఖ రాలు అధిరోహించవచ్చని తెలిపారు. అయితే పాఠశాలలో గతంలో నిర్మించిన 16 వాష్‌రూమ్స్ శిథిలమయ్యాయని, కేవలం 6 మాత్రమే ఉన్నాయని, క్వార్టర్స్‌లో ఉండే ఉపాధ్యాయునుల జీపీ సిబ్బంది ఇంటి పన్ను కట్టాలని నోటీసులు ఇచ్చారని కేజీబీవీ సి బ్బంది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆ విషయాన్ని నేను చూసుకుంటానని కలెక్టర్ భ రోసా ఇచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీ ల్దార్ సంజీవ, ఆర్‌ఐ స్వప్న, హెచ్‌ఎంలు జోగ య్య, ఉషారాణి, వార్డెన్ రాధిక పాల్గొన్నారు.

తాగునీటి సమస్య ఉండొద్దు