
ఎంజీఎం ఓపీ కౌంటర్‌లో పనిచేయని ప్రింటర్లు
ఎంజీఎం : ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య రోగులను ఇబ్బంది పెడుతోంది. శుక్రవారం ఔట్ పేషెంట్ విభాగం అడ్మిట్ కార్డు కౌంటర్‌లో ప్రింటర్లు పనిచేయలేదు. దీంతో వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి క్యూలో బారులుదీరారు. ఉక్కపోతతో నరకం చూశారు. వారి ఇబ్బందిని చూసి సిబ్బంది గత్యంతరం లేక మాన్యువల్‌గా ఓపీ చిట్టీలు రాసి ఇచ్చారు. దీనిపై ఓ రోగి కుటుంబ సభ్యుడు సిబ్బందిని ప్రశ్నించగా ‘విషయం అధికారులకు చెప్పినా పట్టికోవడం లేదు.. మేం ఏం చేస్తామంటూ’ బదులిచ్చారు.

ఎంజీఎం ఓపీ కౌంటర్‌లో పనిచేయని ప్రింటర్లు