రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Apr 5 2025 1:24 AM | Updated on Apr 5 2025 1:24 AM

మడికొండ: రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందిన సంఘటన హనుమకొండ జిల్లా మడికొండ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై గురువారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ధర్మసాగర్‌ మండల కేంద్రానికి చెందిన ఆవుల మల్లేశ్‌(30) రాంపూర్‌ ఇండస్ట్రీయల్‌ ఏరియాలోని మంగళ సీడ్స్‌లో పని చేస్తున్నాడు. ప్రతీ రోజు మాదిరిగానే గురువారం పనికి వెళ్లి ముగించుకొని తన ద్విచక్రవాహనంపై ఔటర్‌ రింగ్‌ రోడ్డు మీదుగా ధర్మసాగర్‌కు తిరిగి వస్తుండగా ఎలుకుర్తి క్రాస్‌ రోడ్డు సమీపంలో వాహనం అదుపుతప్పి పక్కన ఉన్న విద్యుత్‌ స్తంభానికి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మల్లేశ్‌ తల, గొంతు, కుడికాలుకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్‌కు సమాచారం అందించి, చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మల్లేశ్‌ భార్య ఆవుల మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కిషన్‌ తెలిపారు.

పిల్లిని తీసేందుకు వెళ్లి..

బావిలో పడి వృద్ధుడి మృతి

నెక్కొండ: చేద బావిలో పడిన పిల్లిని తీసేందుకు వెళ్లి వృద్ధుడు మృతి చెందిన సంఘటన వరంగల్‌ జిల్లా నెక్కొండ మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఎస్సై మహేందర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన కక్కెర్ల యాదగిరి (59) తన కుమార్తె కిరాయికి ఉంటున్న ఇంట్లోని చేద బావిలో పిల్లి పడి మృతి చెందింది. ఈ విషయాన్ని తన తండ్రి యాదగిరి చెప్పడంతో పిల్లి కళేబరాన్ని తీసేందుకు బావిలో దిగుతున్నాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు తాడు జారీ బావిలో పడిపోయాడు. దీంతో నీట మునిగిన వృద్ధుడు యాదగిరి మృతిచెందాడు. యాదగిరి భార్య నీలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

బాసరలో శాయంపేట యువకుడి మృతి

శాయంపేట : మండల కేంద్రానికి చెందిన బండారి మణికంఠ(19) బాసరలోని శ్రీ వేదభారతి పాఠశాలలో మృతి చెందిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మణికంఠ బాసరలోని శ్రీవేదభారతి పాఠశాలలో రెండు సంవత్సరాలుగా చదువుతున్నాడు. మణికంఠ విద్యుత్‌షాక్‌తో మృతి చెందాడని శుక్రవారం మధ్యాహ్నం బాసరలోని వేద పాఠశాల సిబ్బంది మణికంఠ తండ్రి బండారి రాజేందర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. దీంతో రాజేందర్‌ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తన కుమారుడు మణికంఠను ఎవరో కావాలని హత్య చేసి విద్యుత్‌ షాక్‌గా చిత్రీకరిస్తున్నారని తన కుమారుడి మృతిపై అధికారులు దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలని రాజేందర్‌ కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
1
1/2

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
2
2/2

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement