కేసముద్రం: శ్రీరామ నవమి సందర్భంగా ఇనుగుర్తి మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలకు చెందిన కె.అమూల్య(9వ తరగతి) అనే విద్యార్థిని రావి ఆకులపై సీతారాముల చిత్రాలను శనివారం మలిచింది. అదేవిధంగా సుద్దముక్కపై జై శ్రీరాం అని ఇంగ్లిష్ అక్షరాలను చెక్కి తన సూక్ష్మ కళతో దైవ భక్తిని చాటుకుంది. ఆమె ప్రతిభను చూసి పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు.
నిర్లక్ష్యం వహిస్తే
సహించేది లేదు..
● ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్,
ఎమ్మెల్యే డాక్టర్ మురళీనాయక్
● మార్కెట్‌లో తడిసిన
మిర్చి బస్తాల పరిశీలన
మహబూబాబాద్ రూరల్: రైతులు తీసుకువచ్చిన పంట ఉత్పతుల క్రయవిక్రయాల విషయంలో వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్, ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీనాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ను వారు శనివారం సందర్శించారు. గురువారం రాత్రి కురిసిన అకాల వర్షానికి తడిచిన మిర్చి బస్తాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన ఉత్పత్తులు వెంటనే ఖరీదు చేసి కాంటాలు అయ్యేలా చూడాలని, వ్యాపారులు నిర్లక్షం వహించొద్దని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ యార్డు స్థలం రైతుల అవసరాల మేరకు సరిపోవటంలేదని, కొత్తగా మరో కవర్ షెడ్డు నిర్మాణానికి సహకరించాలని వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ఇస్లావత్ సుధాకర్ నాయక్ వారి దృష్టికి తీసుకువెళ్లారు.
మరమ్మతు పనులు షురూ
మహబూబాబాద్: పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లో పాడైన వస్తువులు, ఆట వస్తువులను మరమ్మతు చేయిస్తామని కమిషనర్ నోముల రవీందర్ అన్నారు. మానుకోట మున్సిపాలిటీ పరిధిలోని పార్కులు, ఓపెన్ జిమ్‌లో నిర్వాహణ లేక చెత్తాచెదారంతో పిచ్చిమొక్కలు ఏపుగా పెరిగి పరిసరాలు అపరిశుభ్రంగా మారాయి. దీంతో ఈనెల 5న సాక్షిలో ‘ఆహ్లాదం..అంతంతే’ అనే శీర్షికన కథనం ప్రచురితమైన విషయం విధితమే. దీంతో కమిషనర్ రవీందర్ స్పందించారు. వెంటనే పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లను శుభ్రం చేయడంతో పాటు మరమ్మతు పనులు చేపట్టాలని సానిటరీ ఇన్‌స్పెక్టర్ కరుణాకర్‌ను ఆదేశించారు. కాగా వెంటనే కరుణాకర్ పారిశుద్ధ్య కార్మికులతో ఇందిరా గ్రౌండ్‌లోని త్రివర్ణ పార్క్‌లో శుభ్రం చేయడం, జిమ్‌కు సంబంధించిన మ్యాట్‌లను సరిచేయడం, తదితర పనులు చేయించారు. ఎన్జీఓఎస్‌కాలనీలోని పార్క్‌లో, జిమ్‌లో సిబ్బంది పిచ్చిమొక్కలు తొలగించడంతో పాటు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ రవీందర్ మాట్లాడుతూ జనరల్ ఫండ్ నుంచి నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో మరమ్మతు పనులు చేయిస్తామన్నారు. వేసవిని దృష్టిలో పెట్టుకుని మొక్కలు ఎండిపోకుండా తగు చర్యలు తీసుకుంటామన్నారు. కాగా సాక్షి కథనంతోనే అధికారులు, కార్మికులు స్పందించి పనులు చేపట్టారని, సాక్షికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
అమూల్య
రావి ఆకుపై సీతారాముల చిత్రాలు
రావి ఆకుపై సీతారాముల చిత్రాలు
రావి ఆకుపై సీతారాముల చిత్రాలు
రావి ఆకుపై సీతారాముల చిత్రాలు