
రూ.10 లక్షల విలువైన గంజాయి పట్టివేత
నల్లబెల్లి: మహారాష్ట్రలోని ముంబాయికి తరలిస్తున్న సుమారు రూ.10 లక్షల విలువైన 21 కిలోల ఎండు గంజాయి పట్టుకుని ఇద్దరి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించనట్లు నర్సంపేట రూరల్ సీఐ సాయిరమణ, నల్లబెల్లి ఎస్సై గోవర్ధన్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం నల్లబెల్లి పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. మహారాష్ట్రలోని ముంబాయికి చెందిన ప్రవీ ణ్ శివబాదర్గే, వర్ష శంబాజీ కటే..రైలులో ఒడిశాలో ని బరంపూర్ వెళ్లి సుమారు రూ.10లక్షల విలువైన 21.73 కిలోల ఎండు గంజాయి కొనుగోలు చే శారు. అనంతరం రైలులో బరంపూర్ నుంచి మహబూబాబాద్ మీదుగా ముంబాయి బయలుదేరారు. మహబూబాబాద్‌లో రైల్వే పోలీసులు తనిఖీలు ని ర్వహిస్తున్నారని తెలుసుకుని రైలు దిగి ఓ వాహనంలో నల్లబెల్లి మీదుగా వరంగల్ బయలుదేరారు. ఈ క్రమంలో మండలంలోని నారక్కపేటలో జాతీయ రహదారిపై ఎస్సై గోవర్ధన్ ఆధ్వర్యంలో సోమవా రం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. గమనించిన నిందితులు పరారయ్యేందుకు యత్నించగా పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి 21.73 కిలోల గంజా యి, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు రూరల్ సీఐ, ఎస్సై పేర్కొన్నారు. సిబ్బంది పాల్గొన్నారు.
ఇద్దరు అరెస్ట్, రిమాండ్
వివరాలు వెల్లడించిన పోలీసులు