
రైతు ఇంట్లో కలెక్టర్ భోజనం
మహబూబాబాద్ రూరల్: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేస్తోంది. ఈమేరకు గురువారం కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో మహబూబాబాద్ మండలంలోని జరుపులతండా గ్రామ పంచాయతీ పరిధి చీకటిచింతల తండాలో రైతు బానోతు గోవింద్ ఇంట్లో సన్నబియ్యంతో వండిన భోజనం తిన్నారు. గోవింద్ కుటుంబ సభ్యులను బియ్యం పంపిణీ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. వారివెంట జిల్లా సివిల్ సప్లయీస్ అధికారి ప్రేమ్ కుమార్, తహసీల్దార్ భగవాన్ రెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు.
లబ్ధిదారులకు సన్నబియ్యం..
నెల్లికుదురు: లబ్ధిదారులందరికీ సన్నబియ్యం అందించాలని, దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే డీలర్‌పై చర్యలు తప్పవని కలెక్టర్ అద్వైత్‌కుమార్ సింగ్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో రేషన్ షాపును కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అలాగే ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న రాజీవ్ యువవికాసం దరఖాస్తుల ఆన్‌లైన్ ప్రక్రియను పరిశీలించారు. పీహెచ్‌సీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. నెల్లికుదురు, మునిగలవీడు గ్రామాల పరిధిలో ఐకేపీ, సొసైటీల ఆధ్వర్యంలో నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు ప్రేమ్‌కుమార్, కె.రాజు, ఎంపీడీఓ బాలరాజుల, పద్మ తదితరులు పాల్గొన్నారు.