
దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి
● మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
తొర్రూరు రూరల్: అకాల వర్షాలు, గాలివాన బీభత్సానికి పాడైన, సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు పరిహారం చెల్లించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని అరిపిరాల గ్రామంలో గాలివాన బీభత్సానికి దెబ్బ తిన్న వరి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు.. రైతుల సంక్షేమం, అభివృద్ధిపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పరిహారం, బోనస్, రైతు బంధు, రుణమాఫీ చేసి ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ తూర్పాటి అంజ య్య, మాజీ జెడ్పీటీసీ మంగళపెల్లి శ్రీనివాస్, నాయకులు కుర్ర శ్రీనివాస్‌గౌడ్, ఎస్‌కే అంకూస్, కొండ వెంకన్న, ఐలయ్య తదితరులు పాల్గొన్నారు.
బస్సు సౌకర్యం కల్పించాలి
నెహ్రూసెంటర్: మహబూబాబాద్ ఆర్టీసీ డిపో ఆధ్వర్యంలో గురువారం ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు డిపో మేనేజర్ ఎం.శివప్రసాద్ తెలిపారు. మహబూబాబాద్ నుంచి ఇర్సులాపురం మీదుగా ఇల్లెందుకు బస్సు సౌకర్యం కల్పించాలని, మహబూబాబాద్ నుంచి సూర్యాపేటకు వయా కందికొండ, మరిపెడ మీదుగా బస్సు నడపాలని ప్రజలు, ప్రయాణికులు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. మానుకోట నుంచి మణుగూరుకు వయా కొత్తగూడెం, పాల్వంచ మీదుగా బస్సులు నడిపించాలని ఫోన్ల ద్వారా కోరినట్లు డీఎం తెలిపారు. ప్రయాణికులు, ప్రజల నుంచి వచ్చిన వినతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. కాగా ఆర్టీసీ బస్సులు, అదనపు ట్రిప్పుల కోసం ప్రయాణికులు డయల్ యువర్ కార్యక్రమంలో వినతి చేసినట్లు తెలిపారు.
తాలు రాకుండా
వరి పంట కోయాలి
● ఏడీఏ శ్రీనివాసరావు
మహబూబాబాద్ రూరల్: వరికొత మిషన్ల యజమానులు వరి పంటలను తాలు రాకుండా కోయాలని వ్యవసాయ సహాయ సంచాలకులు అజ్మీరా శ్రీనివాస్ అన్నారు. మహబూబాబాద్ మండలంలోని వేమునూరు గ్రామంలో యాసంగిలో పండిన వరి పంటను ఏడీఏ శ్రీనివాసరావు గురువారం క్షేత్రస్థాయిలో పర్యటించి పంట కోతలను పర్యవేక్షించారు. వరి కొత్త మిషన్లతో వరి పంటకోతలు జరుగుతున్న తీరును గమనించి.. రైతులు గింజ గట్టిపడిన తర్వాత వరి పంట కోస్తే తాలు రాకుండా ఉండి లాభం జరుగుతుందని తెలిపారు. ఇందిరానగర్ కాలనీ గ్రామంలో పర్యటించి ఇటీవల కురిసిన వడగండ్ల వాన, గాలి, దుమ్ము వల్ల జరిగిన వరి పంట నష్టాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నారెడ్డి తిరుపతిరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఉపాధి కూలీలకు
సౌకర్యాలు కల్పించాలి
తొర్రూరు రూరల్: గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఉపాధి కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పించాలని డీఆర్‌డీఓ మధుసూదన్‌రాజ్ సూచించారు. గురువారం మండలంలోని మడిపెల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉపాధి పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా డీఆర్‌డీఓ మాట్లాడుతూ.. ప్రతి కూలీకి కనీస వేతనం రూ.307 చెల్లించే విధంగా పనులు చేయించాలన్నారు. ఉదయం 6నుంచి 11గంటల వరకే పనులు చేయించాలని, పని ప్రదేశాల్లో తాగునీరు, టెంట్, మెడికల్ కిట్ వంటి వసతులు కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈజీఎస్ అధికారులు మధు, కృష్ణ, సుధాకర్, సతీష్ పాల్గొన్నారు.

దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి

దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలి