
వేరుశనగ సాగుపై రైతులకు శిక్షణ
మామునూరు: ఖిలా వరంగల్ మండలం మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో అధిపతి కేంద్ర ప్రభుత్వం జాతీయ ఆహార భద్రత మిషన్ నేతృత్వంలో శుక్రవారం వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా కేవీకే సీనియర్ శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డాక్టర్ రాజన్న హాజరై వేరుశనగ సాగుపై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించి, మాట్లాడారు. రైతులకు టీసీజీఎస్–1694(విశిష్ట) వేరుశనగ సాగు వివరాలను రైతులకు వివరించారు. అనంతరం రైతులకు టీ సీజీఎస్ 1694 రకం వేరు శనగ విత్తనాలు అందజేశారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు డాక్టర్ సౌమ్య, రాజు, రైతు కోఆర్డినేటర్ రాజిరెడ్డి, హర్షరెడ్డి, సాయిచంద్, రైతులు పాల్గొన్నారు