
డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రణాళికలు
తొర్రూరు: వేసవిలో డిమాండ్‌కు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాకు ప్రణాళికలు రూపొందించామని ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ నరేశ్ తెలిపారు. వేసవి ప్రణాళికలో భాగంగా విద్యుత్‌శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం డివిజన్ కేంద్రంలోని డీఈ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డీఈ మధుసూదన్‌తో కలిసి ఎస్‌ఈ నరేశ్‌మాట్లాడుతూ.. ప్రమాదాలకు చెక్ పెట్టే ందుకు ఎల్‌సీ యాప్‌ను అందుబాటులోకి తెచ్చామని, దీంతో విద్యుత్ శాఖలోని క్షేత్రస్థాయి సిబ్బంది జాగ్రత్తతో వ్యవహరిస్తారన్నారు. వేసవిలో గృహ, వాణిజ్య, వ్యవసాయ అవసరాలకు అనుగుణంగా అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. వడ్డేకొత్తపల్లి, డోర్నకల్, పెద్దనాగారం సబ్ స్టేషన్‌లలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల సామర్థ్యం పెంపు, అయ్యంగారిపల్లి సబ్ స్టేషన్ నుంచి డోర్నకల్, నెల్లికుదురు సబ్ స్టేషన్లకు డబుల్ సర్క్యూట్ లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. దీంతోపాటు పెద్దనాగారం సబ్ స్టేషన్‌లో అదనపు వీసీబీ ఏర్పాటు చేస్తామన్నారు. ఏడీఈ చలపతిరావు, అధికారులు పెద్ది రాజం, రాజ్యలక్ష్మి, జయప్రకాశ్, ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్ ఎస్‌ఈ నరేశ్