అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలి | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలి

Apr 15 2025 1:17 AM | Updated on Apr 15 2025 1:17 AM

అంబేడ

అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలి

మహబూబాబాద్‌ అర్బన్‌: భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడిచి, ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ జాటోతు రాంచంద్రునాయక్‌ అన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని కోర్టుసెంటర్‌లో అంబేడ్కర్‌ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ సింగ్‌, అడిషనల్‌ కలెక్టర్‌ వీరబ్రహ్మచారి, ఎస్సీ షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ అధికారి నర్సింహరావు, కార్పొరేషన్‌ జిల్లా అధికారి శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్‌చందర్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించా రు. అనంతరం రాంచంద్రునాయక్‌ మాట్లాడుతూ.. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ మహోన్నతమైన వ్యక్తి అని, ప్రపంచ దేశాల రాజ్యాంగాలను చదివి భారత రాజ్యాంగాన్ని రంచించి స్వేచ్ఛ, హక్కులను కల్పించారన్నారు. రిజర్వేషన్లు కల్పించడంతో నేడు దళిత, గిరిజనులు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందన్నారు. సమాజంలో ఇప్పటికీ చాలా మంది చదువుకు దూరంగా ఉన్నారన్నారు. ఇంకా దేశంలో అసమానతలు, దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. దళిత, గిరిజనులు చైతన్యవంతులై ప్రశ్ని ంచేతత్వాన్ని అలవర్చుకోవాలన్నారు. ఎమ్మె ల్యే మురళీనాయక్‌, కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌ మాట్లాడా రు. అనంతరం భారత రాజ్యాంగంపై ఎమ్మెల్యేలు, నాయకులు ప్రతిజ్ఞ చేశారు. కాంగ్రెస్‌, వివిధ ప్రజా, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

అంబేడ్కర్‌ ప్రపంచ మేధావి

మహబూబాబాద్‌: బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రపంచ మేధావి అని ప్రభుత్వ విప్‌ జాటోత్‌ రాంచంద్రునాయక్‌ కొనియాడారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌లోని ప్రధాన సమావేశ మందిరంలో అంబేడ్కర్‌ 134 జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్‌ రాంచంద్రు నాయక్‌, ఎమ్మెల్యే భూక్య మురళీనాయక్‌ జ్యోతి ప్రజ్వలన చేసి అంబేడ్కర్‌ చి త్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రభుత్వ విప్‌ మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ ఆదర్శప్రాయుడని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. దేశంలో మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు జరుగుతున్నాయని, వాటిని తిప్పికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మురళీనాయక్‌ మాట్లాడుతూ.. వెనుకబడిన కులాలు ఐక్యంగా ఉండాలని సూచించారు. బీసీలకు న్యాయం చేయడం కోసం బీసీ కుల గణన చేపట్టినట్లు పేర్కొన్నారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అనంతరం కులాంతర వివాహం చేసుకున్న నలుగురు దంపతులకు చెక్కులు అందజేశారు. ఏఎంసీ చైర్మన్‌సుధాకర్‌, బీసీ సంక్షేమశాఖ జిల్లా అఽధికారి, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ నర్సింహస్వామి, కుల సంఘాల నాయకులు కిషన్‌నాయక్‌, పీరయ్య, కామ సంజీవరావు, కోండ్ర ఎల్లయ్య, బీమానాయక్‌, లక్ష్మణ్‌ ఉపేందర్‌ ఉన్నారు.

ప్రభుత్వ విప్‌ రాంచంద్రునాయక్‌

జిల్లా కేంద్రంలో ఘనంగా

అంబేడ్కర్‌ జయంతి వేడుకలు

హాజరైన ఎమ్మెల్యే మురళీనాయక్‌,

కలెక్టర్‌ అద్వైత్‌కుమార్‌సింగ్‌, అదనపు కలెక్టర్‌ వీరబ్రహ్మచారి

అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలి1
1/2

అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలి

అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలి2
2/2

అంబేడ్కర్‌ అడుగు జాడల్లో నడవాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement