
మాట్లాడుతున్న డీఎఫ్‌ఓ రోహిత్‌రెడ్డి
మన్ననూర్: ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించిన అమ్రాబాద్ అభయారణ్యంలోని అడవులు, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు డీఎఫ్ ఓ రోహిత్‌రెడ్డి తెలిపారు. శనివారం మన్ననూర్‌లోని ఈఈసీ సెంటర్ ఫీల్డ్ డైరెక్టర్ క్షితిజా సమక్షంలో ఎన్‌జీఓలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అటవీ పరిసర ప్రాంత గ్రామాల్లోని యువతకు స్వయం ఉపాధితో పాటు ఆరోగ్యం, అందరికీ విద్యపరమైన సహకారం, వన్యప్రాణులు, అడవుల పరిరక్షణకు సహకరించే విధంగాచర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. డబ్ల్యూడబ్ల్యూఎఫ్ టంపల్ మాట్లాడుతూ ‘స్కూల్ బయోడైవర్సిటీ రిజిస్టర్ ప్రోగ్రాం’ ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పాఠశాలల్లో కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు. 2019లో విద్యార్థులకు క్విజ్ పోటీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీటీ, కోనేరు, అపోలో, హెల్త్, హైటికాస్, డబ్ల్యూడబ్ల్యూఎఫ్, టాటా గ్రూప్, జేసీఐకి సంబంధించిన ఎన్‌జీఓలతో పాటు, ఎఫ్‌డీఓ విశాల్, ఎఫ్‌ఆర్‌ఓలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment