కృష్ణా: మండలంలోని ఖాన్‌దొడ్డికి చెందిన తారేష్ భార్యతో గొడవపడి మనస్తాపానికి గురై శుక్రవారం తన పొలంలో పురుగుమందు తాగాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు ఫోన్‌చేసి తెలుపడంతో స్పందించి వెంటనే సెల్‌ఫోన్ లొకేషన్ ఆధారంగా గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని తారేష్‌ను మాగనూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రాణాపాయం తప్పిందని.. ప్రస్తుతం అతడి అరోగ్యం నిలకడగా ఉందని వైద్యుడు తెలిపారు. తారేష్ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లు రామ్‌తేజ, భరత్‌కు భార్య, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment